
● ముగిసిన ఎఫ్‌డీపీ ప్రోగాం
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో ‘రాబోవు తరంలో వైర్‌లెస్ కమ్యూనికేషన్ మరియు హార్వేస్టింగ్ టెక్నాలజీ’పై రెండు వారాల పాటు జరిగిన ఫ్యాకల్టీ డవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌డీపీ) విజయవంతంగా శుక్రవారంతో ముగిసింది. ఈనెల 18 నుంచి 29 వరకు సదస్సు జరిగింది. ఈ ముగింపు సమావేశానికి సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్ రావు, అకడమిక్ డీన్ డా.ప్రఫుల్ల పండా, రిజిస్ట్రార్ డా.అనితా పాత్రోలు పాల్గొనగా.. ప్రభాత్‌కుమార్ పట్నాయక్, డా.ప్రగ్యా పరిమితా ప్రధాన్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
వైర్‌లెస్ కమ్యూనికేషన్, యాంటెన్నా డిజైన్, ఆర్‌ఎఫ్ ఎనర్జీ హార్వేస్టింగ్ టెక్నాలజీస్‌లో తాజా పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా భవిష్యత్‌కు అవసరమైన సంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి దోహదపడుతుందని డా.ప్రఫుల్ల పండా అన్నారు. ఒడిశా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం, ఐసీటీ అకాడమీ, నిట్ సహకారంతో ఈ ఫ్యాకల్టీ డవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొ.గణపతి పండా, డా.శైలేంద్ర కుమార్ (బిలాయి ఐఐటీ), డా.నిశాంత్ కుమార్ (జోద్‌పూర్ ఐఐటీ), డా.అర్నాబ ఘోష్ (రౌర్కెలా ఐఐటీ), పికాన్ మజుందార్ (మెట్‌లాబ్ నిపుణుడు), డా.రాజేశ్వరీ ప్రధాన్ (బుర్లా వీఎస్‌ఎస్‌యూటీ) తదితరులు పాల్గొన్నారు.