మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ల్యాంప్ ఎరువుల కోసం రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం చేసిన ఆందోళన సందర్భంగా శుక్రవారం ఎరువులను సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులంతా సంబంధిత కార్యాలయం వద్దకు చేరుకున్నారు అయినప్పటికీ ఎరువులను పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. అందుబాటులో 1200 బస్తాల ఎరువు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవ్వడం లేదంటూ కదం తొక్కారు. ల్యాంప్ అధికారులు కూడా తమకు స్వష్టత ఇవ్వడం లేదంటూ ఆందోళన చేశారు. పోలీసులు, సమితి అధికారులు రైతులను శాంతింపచేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకూండా పోయింది. సాయంత్రం వరకూ రైతులు రోడ్డుపై బైఠాయించడంతో మల్కన్‌గిరి–మత్తిలి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
ఎరువుల కోసం రైతుల ఆందోళన