
భువనేశ్వర్ మహిళలకు అత్యంత సురక్షితం
భువనేశ్వర్: భువనేశ్వర్ భారతదేశంలోని మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా ఎంపికై ంది. జాతీయ వార్షిక నివేదిక, మహిళా భద్రత సూచిక (ఎన్‌ఏఆర్‌ఐ – నారి) ఈ ఏడాది విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ మహిళా కమిషను ఈ నివేదికని ఆవిష్కరించింది. సురక్షితమైన నగరాల అగ్ర శ్రేణిలో భువనేశ్వర్‌తో పాటు కోహిమా (నాగాలాండ్), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ఐజ్వాల్ (మిజోరాం), గ్యాంగ్‌టాక్ (సిక్కిం), ఇటానగర్ (అరుణాచల్ ప్రదేశ్) ఉన్నాయి.
విధాన సంస్కరణలు, అట్టడుగు స్థాయి చొరవల ద్వారా మహిళలకు సురక్షితమైన వాతావరణాలను సృష్టించడంలో ఈ నగరాలు స్థిరమైన మెరుగుదలలను ప్రదర్శించాయి. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ కిశోర్ రహత్కర్ విడుదల చేసిన నివేదిక ఈ విషయం పేర్కొంది. మరోవైపు ఈ దిశలో రాంచీ, శ్రీనగర్, కోల్‌కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పాట్నా అత్యల్ప స్కోరు సాధించాయి. 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన సర్వే ఆధారంగా దేశవ్యాప్త సూచికని విడుదల చేశారు.