
పల్లెల్లో నువాఖాయ్ వేడుక
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో నువాఖాయ్ బెట్‌గాట్ ఘనంగా జరుగుతోంది. చేతికి అందిన కొత్త ధాన్యంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. కొత్త బియ్యంతో చేసిన వంటలతో పండగ చేసుకుంటారు. తమ ఇష్టమైన ఆరాధ్య దేవతలను పూజలు చేస్తూ సంబరాలు చేసుకుంటూ విందు వినోదాలలో మునుగుతారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గోండో సహచర గిరిజనులతో కలసి గిరిజన సాంస్కృతిక వాయిద్యాలు వాయిస్తూ ఆనందంగా గడిపారు. మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి తన స్వగృహం నబరంగ్‌పూర్ జిలా చందాహండి సమితి దండాబడిలో బంధుమిత్రులు, బీజేడీ కార్యకర్తలలో గడిపారు. నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి తన స్వగ్రామం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి పటికి లో వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించారు. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి నందాహండి సమితి లో గిరిజనులతో సహ పంక్తి భోజనాల్లో పాల్గొన్నారు.

పల్లెల్లో నువాఖాయ్ వేడుక

పల్లెల్లో నువాఖాయ్ వేడుక

పల్లెల్లో నువాఖాయ్ వేడుక