
హత్య కేసులో పోలీసుల సీన్ రీ క్రియేషన్
రాయగడ: ఈ నెల 27వ తేదీన స్థానిక మహిళా కళాశాల వెనుక గల హరిజన వీధికి చెందిన రొహిత్ థప్పా హత్య కేసుకు సంబంధించి ఆ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు శుక్రవారం నాడు సీన్ రిక్రియేషన్ చేశారు. హత్య కేసుకు సంబంధించి నూతన్ నాయక్, మహేష్ నాయక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పట్టుకుని రోహిత్‌ను ఎలా హత్య చేశారు. ఎవరెవరు హత్య చేశారు, ఎలాంటి మరణాయుధాలను వినియోగించారు. మిగతా నిందితులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సీన్ రిక్రియేషన్ చేసిన పోలీసులు స్థానిక అగ్నిమాపక కేంద్రం కార్యాలయం వెనుక గల మైదానంలో ఈ తరహా ప్రదర్శన నిర్వహించారు. హత్య చేసిన సమయంలో ఉన్న నిందితులు ఎలా దాడి చేశారు, అదేవిధంగా హత్య చేసిన అనంతరం నిందితులు ఎలా పారిపోయారు అన్న విషయమై పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. సీన్ రీ క్రియేషన్‌కు సంబంధించి నిందితులను వెంట తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్య కేసులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఈ తరహా సీన్ రీ క్రియేషన్ చేయడం గమనార్హం. అయితే ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

హత్య కేసులో పోలీసుల సీన్ రీ క్రియేషన్