
బీజేడీది మొసలి కన్నీరు
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యుడు గౌతమ్ సామంతరాయ్
జయపురం: ఎరువుల సమస్యలపై రైతులు జరుపుతున్న ఆందోళనను సమర్థిస్తూ బీజేడీ మొసలి కన్నీరు కారుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యుడు గౌతమ్ సామంతరాయ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో రైతులకు ఎరువులు అందజేస్తామని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందేనని, అయినా బీజేడీ కుత్రిమ ఆందోళన చేపడుతుందని దుయ్యబట్టారు. రైతులకు ఎరువులు వెంటనే సమకూర్చాలని బీజేడీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఇటీవల జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని ఘేరావ్ చేయటాన్ని తప్పుబట్టారు. బీజేడీ పాలనలో చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవటానికే ఎరువుల డ్రామా ఆడుతుందన్నారు. ప్రభత్వం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని, ఈ విషయం రైతులు అర్థం చేసుకోవాలని సామంతరాయ్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
వంతెనకు అడ్డంగా పడిన చెట్టు
పర్లాకిమిడి: గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కాశీనగర్ సమితి బి.సీతాపురం పంచాయతీ దేవుదళ గ్రామంలో వంతెనకు అడ్డంగా చెట్టుపడింది. దీంతో గుణుపురం పర్లాకిమిడి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. సర్పంచ్ కె.తేజ, యువకులు దిలీప్, ప్రణయమిశాల్ తదితరులు పాల్గొని వంతెనకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు.

బీజేడీది మొసలి కన్నీరు