
ఇనుపకుర్తి ‘బిముగ్ద సమ్మాన్’తో సత్కారం
పర్లాకిమిడి: ప్రముఖ వాగ్గేయకారుడు, సెక్సోఫోన్‌లో ఏ–గ్రేడ్ సంపాదించిన పర్లాకిమిడి వాసి ఇనుపకుర్తి మన్మధరావుకు భువనేశ్వర్‌లో భంజమండపంలో బుధవారం ‘బిముగ్ద సమ్మాన్’ ఆవార్డుతో ఒడిశా సంగీత నాటక అకాడమి, గజపతి జిల్లాకు చెందిన పదామృత నృత్యాయన సంస్థ తరఫున కార్యదర్శి చంద్రశేఖర హోత్తా సన్మానించారు. మన్మధరావుకు అవార్డు కింద నగదు బహుమతి రూ.5వేలు, తామ్రపత్రం, దుశ్శాలువతో సన్మానించినట్టు సంగీత దర్శకులు రఘునాథ పాత్రో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పదామృత నృత్యాయన అకాడమి అధ్యక్షుడు నృసింహా చరణ్ పట్నాయక్, శుభశ్రీ ముఖర్జీ, గురు ధనేశ్వర స్వయిం, సీతాకాంత జెన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిస్సీ కళాకారులు ప్రీతిప్రియా, బింధుప్రియాలు నృత్యం చేసి పలువురిని అలరించారు.