
శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ చక్కర్లు
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్ సంచలనం వివాదాలు రేపుతోంది. బొడొ దండొ మార్కెట్ చౌరస్తా నుంచి శ్రీ మందిరం వరకు డ్రోన్ చక్కర్లు కొట్టిన దృశ్యంతో వీడియో ప్రసారం దుమారం రేపతుంది. ప్రధాన ఆలయ శిఖర ప్రాంగణం డోలమండపం మీదుగా ఎగిరి మార్కెట్ చౌరస్తా వైపు చక్కర్లు కొట్టినట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ సంఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రోన్ నిరోధక వ్యవస్థ ప్రవేశ పెట్టినట్లు స్వామి రథ యాత్ర పురస్కరించుకుని రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ ప్రకటంచిన విషయం తెలిసిందే. మరో వైపు శ్రీ మందిరం ప్రాంగణం నో ఫ్‌లై జోన్‌గా ప్రకటించిన పరిస్థితుల్లో తరచూ డ్రోన్ సంచారం శ్రీ మందిరం భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తోంది.