
లక్ష్యసాధన అభినందనీయం
● రాష్ట్ర మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ● ఆకాంక్ష జిల్లా అధికారులకు పురస్కారాలు ప్రదానం
పర్లాకిమిడి:
గజపతి జిల్లాలో ఐదు ప్రభుత్వ శాఖలు హెల్త్, విద్య, మహిళా స్వయం సహాయక గ్రూపులు, పౌర సరఫరాలు, ఐ.సి.డి.ఎస్‌లు లక్ష్యాలు సాధించడం అభినందనీయమని రాష్ట్ర ఎౖక్సైజ్, వర్క్స్, న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆర్.శెట్టి భవ నంలలో బుధవారం సంపూర్ణతా అభియాన్ సత్కా ర మహోత్సవం నిర్వహించారు. ఆర్.ఉదయగిరి, గుమ్మా బ్లాకులలో సంపూర్ణవిజయాలు సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ఆదేశాల మేరకు ఆయా బ్లాకుల అధికారులు, వర్క ర్లు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, డి.ఎఫ్.ఓ. కె.నాగరాజు, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, కలెక్టర్ మధుమిత, ఎస్పీ జ్యోతీంద్ర పండా, జిల్లా పరిషత్తు ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా తదితరులు హాజరయ్యారు. గుమ్మా, ఆర్.ఉదయగి రి ఆకాంక్ష సమితులలో ఐదు ప్రభుత్వ శాఖల అధికారులకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశా రు. మొత్తం 115 మంది అధికారులతో పాటు వర్క ర్లు, దిగువస్థాయి అధికారులకు కూడా మంత్రి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. వీరిలో బి.డీ.ఓ.(గుమ్మా) దులారాం మరాండి, గు మ్మా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సార్థో పండా, గుసాని బి.డి.ఒ. గౌరచంద్ర పట్నాయక్, డీఈఓ డాక్టర్ మాయధర్ సాహు, శిశుసంక్షేమాభివృద్ధి అధికారి మనోరమా దేవి, సి.డి.ఎం.ఓ. డాక్టర్ యం.యం. ఆలీ, జిల్లా ఉపాధి, నైపుణ్యతాభివృద్ధి శాఖ అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి ఉన్నారు.
ప్రజల చెంతకు పథకాలు..
ఈ సందర్భంగా మంత్రి హరిచందన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి స్థానిక అధికారుల చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసి ప్రజల వద్దకు చేర్చాలన్నారు. గజపతి జిల్లాలో మహిళాభివృద్ధికి పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షాధిపతులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

లక్ష్యసాధన అభినందనీయం

లక్ష్యసాధన అభినందనీయం

లక్ష్యసాధన అభినందనీయం