‘ఆత్మాహుతి’ విచారణ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

‘ఆత్మాహుతి’ విచారణ వేగవంతం

Aug 7 2025 10:33 AM | Updated on Aug 7 2025 10:33 AM

‘ఆత్మాహుతి’ విచారణ వేగవంతం

‘ఆత్మాహుతి’ విచారణ వేగవంతం

భువనేశ్వర్‌: బాలాసోర్‌ ఫకీర్‌ మోహన్‌ కళాశాల విద్యార్థిని ఆత్మాహుతి సంఘటనపై విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర క్రైం శాఖ అధీనంలో మహిళలపై నేరాల విభా గం సీఏడబ్ల్యూ త్వరితగతిలో దర్యాప్తు ముగించేందుకు రంగంలోకి దిగింది. ఈ ప్రక్రియని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ స్థాయి అధికారి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర సీఐడీ పోలీసు సూపరింటెండెంట్‌ అనిరుధ్‌ రౌత్రాయ్‌ మార్గనిర్దేశకులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయన బాలాసోర్‌ను సందర్శించారు.

పిడుగుపాటుతో మహిళ మృతి

ఎనిమిది మందికి గాయాలు

పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్‌ మర్లబ పంచాయతీలో పెగ్గడ గ్రామంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిడుగు పడి మహిళ మృతి చెందింది. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ పెగ్గడ గ్రామానికి చెందిన మోనీ గోమాంగో (35) అని రాయఘడ పోలీసు అధికారులు తెలియజేశారు. పోలీసుల తెలిపిన సమాచారం మేరకు.. చెరువు పనిలో కూలీలు పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వారికి దగ్గరలో పిడుగు పడటంతో అక్కడే ఉన్న కూలీలకు తీవ్రగాయలయ్యాయి. మహిళ మృతి చెందింది. సునీతా శోబోరో, సుశీలా శబోరో, సుభద్ర శోబోరో, సునాయి శోబోరోకు గాయాలయ్యాయి. వీరిని రాయఘడ బ్లాక్‌ స్వస్థ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పర్లాకిమిడి పెద్దాస్పత్రికి రిఫర్‌ చేశారు. రాయఘడ బ్లాక్‌ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును నమోదు చేశారు.

చికిత్స పొందుతూ

యువకుడు మృతి

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని ఒక బంగారు దుకాణంలో పనిచేస్తున్న యువకుడు కడుపునొప్పి తాళలేక విషంతాగి చికిత్స పొందుతూ మృతి చెందాడని రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు బుధవారం తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంతకవిటి మండలం జీఎంపురం గ్రామానికి చెందిన గురుగుబెల్లి పృథ్వీరాజ్‌ (25) నగరంలోనే అద్దె ఇంట్లో ఉంటూ షాపులో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా తీవ్రంగా కడుపు నొప్పి వేధిస్తుండడంతో రెండు రోజుల క్రితం విషం తాగాడు. విషయం తెలిసిన బంధువులు ముందుగా రిమ్స్‌లో చేర్చారు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతి చెందడంతో మృతుని మేనమామ టి.జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

అందుబాటులోకి వ్యాక్సిన్లు

టెక్కలి రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో పలుమార్లు సాక్షిలో వెలువడిన కథనాలకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కె.కొత్తూరు పీహెచ్‌సీ ఆరోగ్య సిబ్బంది అధ్వర్యంలో ఐపీవీ, డీపీటీ, ఎంఆర్‌, రోటా, ఓపీవీ ఇతర వ్యాక్సిన్లు చిన్నారులకు వేశారు.

అథ్లెటిక్స్‌ పోటీలకు

11 మంది విద్యార్థ్ధులు

ఇచ్ఛాపురం: ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనుపూర్‌ అక్షర సీబీఎస్‌ఈ పాఠశాలలో జరగనున్న సీబీఎస్‌ఈ క్లస్టర్‌ 7 అథ్లెటిక్స్‌ పోటీల్లో స్థానిక జ్ఞానభారతి నుంచి 11 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పాఠశాల కార్యనిర్వాహణ అధికారి జోహార్‌ఖాన్‌ తెలిపారు. ఈ మేరకు వీరికి పాఠశాల ఆవరణలో బుధవారం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ రమణమూర్తి, ప్రిన్సిపాల్‌ ఐబీ పండా, హెచ్‌ఎం రషీదా సుల్తానా, వ్యాయామ ఉపాధ్యాయులు కై లాస్‌పండా, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ టీచర్లకూ అవార్డులు ఇవ్వాలి

శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులను ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్నవారికి సైతం అందజేయాలని ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.మన్మథరావు, జిల్లా అధ్యక్షుడు నాగశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావులు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యతలో వంద శాతం సాధించడానికి ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ పాత్ర ఎంతో కీలకమనే విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్స్‌ కంటే.. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్స్‌ ఎంతో అధికమన్నారు. తమను కూడా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల్లో చేర్చేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement