
విషాద తీరం!
సంతబొమ్మాళి: భావనపాడు సముద్రతీరంలో మంగళవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురు పాలిటెక్నికల్ విద్యార్థులు దున్న దుర్యోధన, తిమ్మల జశ్వంత్, రాయట రాజేష్ విగతజీవులుగా మారారు. వీరి మృతదేహాలు బుధవారం తీరానికి చేరాయి. మైరెన్ సీఐ రాము ఆధ్వర్యంలో మైరెన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు రెండు బృందాలుగా విడిపోయి రాత్రంతా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం అర్థరాత్రి సుమారు 12 గంటలకు జశ్వంత్ మృతదేహం భావనపాడు తీరానికి చేరింది. ఆ తర్వాత గంటన్నర వ్యవధిలో రాత్రి 1.30 గంటలకు రాజేష్ మృతదేహం అదే తీరానికి చేరుకుంది. మిగిలిన దుర్యోధన మృతదేహం బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు భావనపాడు తీరానికి కొట్టుకొచ్చింది. మృతదేహాలకు శవపంచమా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుమారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
భావనపాడు తీరానికి చేరిన మూడు
మృతదేహాలు
శోకసంద్రంలో బాధిత కుటుంబాలు

విషాద తీరం!

విషాద తీరం!

విషాద తీరం!