
ఎస్‌టీఎఫ్ దాడులు
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
దుకాణాలపై..
శ్రమదానంతో కర్ర వంతెన ఏర్పాటు
భువనేశ్వర్:
కళాశాలలు తదితర విద్యా సంస్థల సమీపంలోని దుకాణాల్లో రహస్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు జోరందుకుంటున్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్ ) ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. మంగళవారం నగర వ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో సందిగ్ధ దుకాణాలపై దాడులు నిర్వహించింది. దాడుల్లో భాగంగా దుకాణంలో విక్రయం అవుతున్న సామగ్రి తనిఖీ చేసింది. తనిఖీల్లో పలు సందిగ్ధ మాదక ద్రవ్యాల్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి పరీక్షల కోసం సన్నాహాలు చేపట్టారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విద్యా సంస్థల సమీపంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టడానికి కీలక ప్రాంతాలలో ఆకస్మిక దాడులు ప్రారంభించినట్లు వివరించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సహా ప్రముఖ విద్యా సంస్థలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన పటియా, ఖండగిరి ప్రాంతాల్లో నగర కమిషనరేటు పోలీసులు, ఎస్‌టీఎఫ్ బృందాలు సమన్వయంతో దాడులు నిర్వహించాయి. విద్యార్థులు, యువతకు నిషేధిత పదార్థాలను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తూ కళాశాల క్యాంపస్‌ల సమీపంలో ఉన్న చిన్న దుకాణాలు, కియోస్క్‌లను గురి పెట్టి ప్రత్యేకంగా ఈ దాడులు చేపట్టడం విశేషం. విద్యార్థులు ఎక్కువగా ఉండే క్యాంపస్ తదితర ప్రాంతాల్లో చుట్టుపక్కల బ్రౌన్ షుగర్, గంజాయి (గంజాయి) వంటి మాదక ద్రవ్యాల అమ్మకాలకు సంబంధించి విశ్వసనీయ రహస్య సమాచారం ఆధారంగా ఈ చర్యకు ప్రత్యేక టాస్క్‌ఫోర్సు నడుం బిగించింది. రహస్యంగా మాదకద్రవ్యాల విక్రయం యువకులను వ్యసనానికి ప్రేరేపిస్తుందనే ఆరోపణలు బలం పుంజుకున్నాయి. ఈ ప్రభావాన్ని ఆదిలోనే అణగదొక్కాలనే దృఢ సంకల్పంతో దాడులు, తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. దాడుల సమయంలో అనేక దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు సందిగ్ధ మాదక ద్రవ్యాల్ని స్వాధీనపరచుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాలను సిఫారసు చేశారు. నగరంలో విద్యా సంస్థల పరిసర దుకాణాల్లో రహస్యంగా మాదక ద్రవ్యాల విక్రయాల కట్టడికి క్రైం శాఖ లోగడ దాడులు నిర్వహించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పునరుద్ఘాటించారు.
న్యూస్‌రీల్

ఎస్‌టీఎఫ్ దాడులు

ఎస్‌టీఎఫ్ దాడులు

ఎస్‌టీఎఫ్ దాడులు