
నేడు జయపురానికి సీఎం రాక
జయపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహణ చరణ మఝి శనివారం జయపురం వస్తున్నారు. దీంతో అధికారులు అందుతగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఏర్పాట్లను కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్, జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్య రెడ్డి, ఎస్పీ తదితరులు బంకబిజ మైదానంలో ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. జయపురం సమీపంలో బంకబిజ మైదానంలో నిర్వహించబడే సభా కార్యక్రమంలో సుభద్ర పథకంలో మూడవ విడత పైకాన్ని లబ్ధిదారులైన మహిళలకు అందజేస్తారు. అందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 20 వేల మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా మూడు పెండాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల కోసం భోజన, శౌచాలయ, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ప్రభాత్ పొరిడ, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని అధికారులు తెలిపారు.