కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Aug 9 2025 8:05 AM | Updated on Aug 9 2025 8:05 AM

కుట్ట

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జయపురం: కుట్టు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ మనోజ్‌ సత్య భాను మహాజన్‌ కోరారు. జయపురం సబ్‌డివిజన్‌ కొట్పాడ్‌ మిరిగన్‌లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్‌పాడ్‌లో చేనేత వస్త్ర పరిశ్రమ ఎంతో పేరుగాంచిందన్నారు. కొట్‌పాట్‌ నేయబడుతున్న వస్త్రాలతో మిరగన్‌ వస్త్ర ఉత్పత్తులు చేసి మార్కెటింగ్‌ ద్వారా వాటిని ప్రజలకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో జయపురంలో మిరగన్‌ వస్త్ర కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు విక్రయ దుకాణాలు నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన మహిళలు, మార్కెటింగ్‌ చేసే మహిళల ఆర్థిక ప్రగతికి దోహద పడగలదని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో నూతన కౌశల్యంతో కొట్‌పాడ్‌ ప్రాంత సంప్రదాయ చేనేతవస్త్ర పరిశ్రమ మిరిగన్‌ వస్త్రాలకు మరింత బలోపేతం చేసేందుకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మిరగన్‌ వస్త్రాలతో 19 రకాల బర్ణికబేగ్‌ తదితర వస్తువులను తయారు చేసేందుకు శిక్షణ కేంద్రంతో పాటు విక్రయ కేంద్రాలను జయపురం బీడీవో కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌తోపాటు అతిథులు మిరిగన్‌ వస్త్రాలను తిలకించారు. కేంద్రం ప్రారంభోత్సవంలో సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, ఉపాధ్యక్షులు గణేష్‌ పాఢీ, జయపురం సబ్‌కలెక్టర్‌ కుమారి అక్కవరం శొశ్య రెడ్డి, బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి శక్తి మహాపాత్రో, సీడీపీవో కాంచన పండ, జిల్లా పరిషత్‌ సభ్యులు త్రిపతి పట్నాయక్‌తోపాటు సమితి సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. శిక్షణా కేంద్రంలో 45 మంది శిక్షణ పొందేందుకు సౌకర్యాలు ఉన్నాయని బీడీవో శక్తి మహాపాత్రో వెల్లడించారు. శిక్షణ పొందిన మహిళలు తయారు చేసే వస్తువులు విక్రయించేందుకు జయపురం పట్టణంలో ఒక దుకాణం ప్రారంభంచనున్నట్లు చెప్పారు.

కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ మనోజ్‌ సత్య భాను మహాజన్‌

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి 1
1/4

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి 2
2/4

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి 3
3/4

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి 4
4/4

కుట్టుశిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement