
రాయగడలో రాఖీ ఉత్సవాలు ప్రారంభం
● విక్రయ స్టాళ్లు ఏర్పాటు
రాయగడ: ఒడిశా రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ (ఒర్మాస్), జిల్లా యంత్రాంగం సంయుక్తంగా స్థానిక కొత్తబస్టాండు సమీపంలోని ట్రైబల్ వరల్డ్ వద్ద రాఖీ ఉత్సవాలను ఏర్పాటు చేసింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ్ కుమార్ ఖెముండొ ముఖ్యఅతిథిగా హాజరై మంగళవారం ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు రూపొందించిన ఈ రాఖీలను ఖరీదు చేయాలని పిలుపునిచ్చారు. వీటి అమ్మకాలతో వారికి మనం ఆర్థికంగా ఆసరా కల్పించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వెదురు వంటి సహజ సిద్ధమైన ముడిసరుకును వినియోగించి అతి సుందరంగా తయారు చేసిన రాఖీలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఓర్మాస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలను ప్రొత్సాహించాలన్న ముఖ్యఉద్దేశంతో రాఖీ ఫెస్టివల్ పేరిట విక్రయ కేంద్రాన్ని నిర్వహించామని అన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు విక్రయ కేంద్రం కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలొ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, ప్రజా సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు.

రాయగడలో రాఖీ ఉత్సవాలు ప్రారంభం