
వ్యాపారి దారుణ హత్య
రాయగడ : ఒక వ్యాపారిని అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని స్థానిక హలువ తోట సమీపంలో గల శ్మశానంలో పూడ్చివేసిన ఘటనకు సంబంధించి కొరాపుట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం నాడు దుండగుడిని తీసుకువచ్చి పూడ్చి వేసిన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. కొరాపుట్ జిల్లాలొని నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మెడిపూట్ గ్రామానికి చెందిన సొమనాథ్ జాని (34) అనే పనసకాయల వ్యాపారిని హత్య చేసిన అనంతరం ఆ మృతదేహాన్ని దుండగులు రాయగడ సమీపంలో గల హలువా తోటకు దగ్గరలొ గల శ్మశానంలో పూడ్చి వేశారు. గత మూడు నెలలుగా వ్యాపారం కోసం వెళ్లిన సోమనాథ్ కనిపించడం లేదని కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సొమనాథ్ హత్యకు గురయ్యాడని తెలుసుకుని అందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారిని దర్యాప్తు చేయగా విషయం బయట పడింది. తామే వ్యాపారి సోమనాథ్‌ను హత్యచేసి మృతదేహాన్ని రాయగడకు తీసుకువెళ్లి పూడ్చి వేశామని నిందితులు పోలీసుల వద్ద అంగీకరించారు. ఈ మేరకు నిందితుల్లో ఒకరిని నందపూర్ పోలీసులు మంగళవారం నాడు రాయగడ తీసుకువచ్చి మృతదేహాన్ని పూడ్చివేసిన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

వ్యాపారి దారుణ హత్య

వ్యాపారి దారుణ హత్య