
రాష్ట్రస్థాయి తైక్వాండ్ పోటీల్లో బర్షితా దాస్ ప్రతిభ
పర్లాకిమిడి: రాష్ట్ర స్థాయి అస్మితా తైక్వాండ్ లీగ్ పోటీలు భఽఽద్రక్ జిల్లాకేంద్రంలోని బిజూ పట్నాయక్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల రెండు, మూడు తేదీల్లో జరిగాయి. వాటిలో ఒడిశా నుంచి 250 మంది బాలికలు పాల్గొనగా.. గజపతి జిల్లా తైక్వాండో అకాడమి నుంచి నలుగురు మహిళా క్రీడాకారులు హాజరయ్యారు. వాటిలో ముఖ్యంగా రెండు విభాగాలలో పోటీ జరిగింది. ఈ పోటీలు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగ్గా ఖేలో ఇండియా నిర్వహించింది. వీటిలో పర్లాకిమిడికి చెందిన బర్షితా దాస్ స్వర్ణం, కాంస్య పతకాలు సాధించగా, పి.సాయిస్మితా వెండి, అనుష్కా అనహితా సాహు వెండి పతకాలు సాధించారు. ముగ్గురు పర్లాకిమిడి నుంచివిజేతలుగా నిలిచినందుకు జిల్లా తైక్వాండ్ అకాడమి కోచ్ కార్తీక్ మహాపాత్రో అభినందనలు తెలియజేశారు. గజపతి జిల్లా తైక్వాండో అకాడమి గౌరవ అధ్యక్షులు కోడూరు నారాయణరావు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రస్థాయి తైక్వాండ్ పోటీల్లో బర్షితా దాస్ ప్రతిభ