
విద్యార్థులకు కంటిఅద్దాల పంపిణీ
జయపురం: జయపురం పట్టణం, సమితి ప్రాంతాలలోని వివిధ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయంలో విద్యా విభాగ సాధన కేంద్రంలో నేత్ర పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా 101 మంది విద్యార్థులకు కంటిఅద్దాలను సమకూర్చారు. కార్యక్రమంలో సమితి విద్యాధికారి కె.గోపాలరావు, సమితి అధికారి సోమనాథ్ గదబ, సమితి రిసేర్చ్ పర్సన్ డాక్టర్ సుభద్రా పాత్రో, ఎస్.గణేష్ ప్రసాద్ చౌధురి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.