
ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా శోభన మ
భువనేశ్వర్: శోభన మహంతి రాష్ట్ర మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నియామకం మొదలుకొని ఆమె మూడేళ్ల పాటు నిరవధికంగా ఈ హోదాలో కొనసాగుతారు. శోభన మహంతి బాలాసోర్ జిల్లా రెముణ ప్రాంతానికి చెందిన వారు. మరో నలుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రతిభ శత్పతి, ఊర్మిళ మహాపాత్రో, కల్పనా మల్లిక్, ముక్తా సాహు మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైనట్లు పేర్కొన్నారు.
అరాచక పాలన..
మరో ఉదాహరణ
● టీడీపీ వేధింపులకు గురై మహిళ ఆత్మహత్యాయత్నం
● డీలర్‌షిప్ రద్దు చేసి వేరొకరికి కట్టబెట్టడంతో మనస్తాపం
● బతుకు తెరువు లేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి అరాచక పాలనకు మరో ఉదాహరణ తారసపడింది. ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ అరాచకం పరాకాష్టకు చేరింది. అసలే ఇసుక మాఫియా, భూ దందాలతో ఈ నియోజకవర్గం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీనికి వేధింపులు తోడవుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారు మనుషులే కాదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేకపోయినా వారి జీవన హక్కును కూడా కాలరాస్తున్నారు. కూటమి పాలకుల కుట్రకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. పదేళ్లుగా ఆమె నిత్యావసర సరుకుల డీలర్‌షిప్ నిర్వహిస్తుంటే.. కేవలం తమ అనుకూలురుకు ఇచ్చేందుకు ఆమె డీలర్‌షిప్‌ను రద్దు చేశారు. దీనిపై ఆమె కోర్టుకు వెళితే కేసు ఉంటుండగానే మరొకరికి ఆ డీలర్‌షిప్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమదాలవలస మండలం మునగవలస గ్రామానికి చెందిన మునగవలస ధనలక్ష్మి మంగళవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్యాలయానికి వస్తున్న సమయంలో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే..
ఆమదాలవలస మండలం మునగవలస గ్రామానికి చెందిన మునగవలస శారదాంబ ఊరిలో రేషన్ డీలర్‌షిప్ నిర్వహించేవారు. ఆమె గతంలో చట్టపరంగా ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెనే వారసురాలిగా ప్రకటించారు. శారదాంబ నిర్వహించే ఎఫ్‌పీ షాపు నిర్వహణ కూడా తన వారసురాలు ధనలక్ష్మికి అప్పగించారు. గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి సమస్య లేకుండా ఆమె పనిచేసుకున్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో కొందరు గ్రామస్తులు షాపును డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. అయినా డ్వాక్రా గ్రూపు లీడర్‌గా ధనలక్ష్మి ఆ షాపును నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆమె డీలర్ షిప్‌ను రద్దు చేసి వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు టీడీపీ వర్గీయులు ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ కుట్రలు తెలుసుకున్న ధనలక్ష్మి తన డీలర్ షిప్‌ను నిలబెట్టుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో కోర్టులోనే ఉన్నా టీడీపీ నాయకులు వెరవకుండా వేరొకరికి డీలర్‌షిప్ కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానంలో ధనలక్ష్మికి వ్యతిరేకంగా అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న ధనలక్ష్మి తనకు ఉపాధి పోతుందన్న భయంతో మంగళవారం ఉదయం సుమారుగా 11 గంటల సమయంలో కలెక్టరేట్ వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న వారు ఆమెను పొన్నాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు రిమ్స్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ధనలక్ష్మి రిమ్స్‌లో అత్యవసర విభాగంలో వైద్య సేవలు పొందుతోంది.
‘ఆదికర్మయోగి’పై శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు ఆది కర్మ యోగి శిక్షణ ద్వారా పరిపాలనలో సమర్థత పెరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం, గ్రామ స్థాయిలో శాశ్వత మార్పులకు దోహదపడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులకు ఆది కర్మ యోగి–రెస్పాన్సివ్ గవర్నెన్‌న్స్ ప్రోగ్రాంపై ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూం గిరిజన ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా చేరాలంటే, అధికారులు వారి జీవన పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక వినూత్నమైన ప్రజా భాగస్వామ్య కార్యక్రమమని గ్రామాల్లో యువత, మహిళలు, వలంటీర్లను శిక్షణతో నైపుణ్యం కలిగించి, స్థానిక సేవలలో మార్పునకు మార్గం వేయాలన్నదే లక్ష్యమని చెప్పారు.

ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా శోభన మ