
అడవి పందుల కోసం వలవేస్తే.. ఎలుగుబంట్లు చిక్కాయి!
మల్కన్‌గిరి: అడవి పందుల కోసం వేసిన వలలో ఎలుగుబంట్లు చిక్కాయి. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి బురిడిగూడ రిజర్వ్ అడవిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అటుగా పెట్రోలింగ్ కోసం వెళ్లి అటవీ సిబ్బందికి వలలో చిక్కకొని గాండ్రిస్తున్న తల్లీపిల్ల భల్లూకాలు తారసపడ్డాయి. దీంతో సహాయక చర్యలు ప్రారంభించారు. అటవీశాఖ మాత్తిలి ప్రాంత ఫీల్డ్ సిబ్బంది ర్యాపిడ్ రెస్పాన్స్ బృందంతో కలిసి వలలో చిక్కుకున ఎలుగుబంట్లను సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అవి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. అటవి జంతువులను వెటాడే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని సిబ్బంది హెచ్చరించారు.

అడవి పందుల కోసం వలవేస్తే.. ఎలుగుబంట్లు చిక్కాయి!