బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన

Jul 22 2025 6:38 AM | Updated on Jul 22 2025 9:01 AM

బొడసు

బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన

కొరాపుట్‌: బొడసుక్కు వంతెన నిర్మాణ పురోగతిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, తాగునీటి శాఖ మంత్రి రబినాయక్‌ పరిశీలించారు. సోమవారం కొరాపుట్‌ జిల్లా కేంద్రం నుంచి నిర్మితమవుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. రూ.64 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ వంతెన వల్ల దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. బొడసుక్కు గ్రామం నుంచి కొరాపుట్‌కి కేవలం 5 కిలోమీర్ల దూరం ఉంటుందని తెలిపారు. కానీ అడ్డంగా కొలాబ్‌ రిజర్వాయర్‌ ఉండడంతో ప్రజలు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. ఇక్కడ వంతెన కోసం కొరాపుట్‌, నందపూర్‌, లమ్తాపుట్‌ సమితుల ప్రజలు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతానికి కనెక్టెవిటీ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో, రుపు దర్‌ బోత్ర, కలెక్టర్‌ వి.కీర్తి వాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన 1
1/1

బొడసుక్కు వంతెన నిర్మాణ పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement