ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు

Jul 22 2025 6:38 AM | Updated on Jul 22 2025 9:01 AM

ఏఐసీస

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు

కొరాపుట్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఏకై క ఎంపీ సప్తగిరి ఉల్క (కొరాపుట్‌) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖార్గేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం న్యూఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కొరాపుట్‌ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఖర్గేను అభినందించారు. రాహుల్‌ గాంధీ కోటరీలో ఉన్న ఎంపీ సప్తగిరి ఉల్కపై ఏఐసీసీకి ప్రత్యేక అభిమానం ఉంది. గత రెండు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సప్తగిరి ఉల్క మాత్రమే విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈశాన్య భారతంలో ఐదు రాష్ట్రాలకు సప్తగిరి ఉల్క పరిశీలకుని హోదాలో ఉన్నారు. కార్యక్రమం అనంతరం రాహుల్‌తో భేటి అయి బేటీ ఒడిశా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల వివరాలు అందించారు.

8 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ స్వాభీమాన్‌ ఏరియా జోడాంబు పోలీసుస్టేషన్‌ పరిధిలోని సధరామ్‌ గ్రామ అడవిలో గంజాయి ఉన్నట్లు ఆదివారం రాత్రి జిల్లా ఎకై ్సజ్‌ అధికారి బింబధర్‌ పండాకు ముందస్తు సమాచారం రావడంతో ఆదివారం రాత్రి ఎకై ్సజ్‌ శాఖ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 8 క్వింటాళ్ల గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రాకను గమనించిన మాఫియా సభ్యులు పరారైపోయారు. గంజాయి తూకం వేయగా 844 కిలోలు ఉంది.

42 కిలోల అడవి పంది

మాంసం పట్టివేత

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభీమాన్‌ ఏరియా సరుకుబంద్‌ గ్రామం సమీపం అడవి వద్ద ఆదివారం రాత్రి చిత్రకొండ అటవీ శాఖ వారు అడవి పందుల వేటగాళ్లను పట్టుకున్నారు. వారి నుంచి 42 కిలోలకు పైగా మాంసం, వందకు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు అడవి పంది పిల్లలు, 9 బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండ అటవీ శాఖ వారికి ఈ ప్రాంతంలో అడవి జంతువుల వేట జరుగుతుందని సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారి నిరంజన్‌ సార్కా నేతృత్వంలో రేంజ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ కుమార్‌ సేఠి తన సిబ్బందితో కలిసి దాడి చేశారు.

ఏటీఎం లూటీ యత్నం భగ్నం

జయపురం: జయపురంలోని ఎస్‌బీఐకి చెందిన ఏటీఎంను లూటీ చేసేందుకు దుండగులు ప్రయత్ని్‌ంచగా స్థానికులు భగ్నం చేశారు. జయపురం పట్టణ పోలీసుస్టేషన్‌కు వంద మీటర్ల దూరంలోని ఏటీఎం కౌంటర్‌ లూటీ చేసేందుకు దుండగులు చేసిన ప్రయత్నాన్ని ఆ ప్రాంత ప్రజలు భగ్నం చేసినట్లు పట్టణ పోలీసు అధికారి సోమవారం తెలిపారు. పోలీసుల వివరణ ప్రకారం.. ఆదివారం ఎస్‌బీఐ ఏటీఎం కౌంటర్‌ లూటీ చేసేందుకు ఇద్దరు యువకులు కౌంటర్‌ను బద్ధలు కొడుతుండగా స్థానికులు చూసి వారిని చుట్టుముట్టి పోలీసులకు తెలియజేశారు. వెంటనే పోలీసులు చేరుకొని వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిరువురు మరో రాష్ట్ర వాసులని పోలీసు అధికారి వెల్లడించారు. పోలీసులు వారిని విచారించగా పట్టుబడిన వ్యక్తులు హరియాణ రాష్ట్రానికి చెందిన రసీద్‌ ఖాన్‌, మోహిన్‌ ఖాన్‌లు వెల్లడించారు. వారు హర్యాణ రాష్ట్రం నుంచివచ్చి కార్మికులుగా పని చేస్తున్నారని వెల్లడించారు. గతంలో రాయగడ జిల్లా మునిగుడలో కార్మికులుగా పని చేసి కొరాపుట్‌ జిల్లాకు వచ్చారని పోలీసులు చెప్పారు. ఏటీఎం సూపర్‌వైజర్‌ ఫిర్యాదు మేకరు వారిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు 1
1/3

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు 2
2/3

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు 3
3/3

ఏఐసీసీ అధ్యక్షుడుకి కొరాపుట్‌ ఎంపీ శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement