
రెవెన్షా హాస్టల్‌లో ర్యాగింగ్ ఆరోపణలు
● 10 మంది విద్యార్థుల తొలగింపు ● సమైక్యంగా ఎదురు తిరిగిన విద్యార్థులు
భువనేశ్వర్:
కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వివాదం ఆకస్మిక మలుపులు తిరగడంతో క్యాంపస్ లో వివాదాస్పద పరిస్థితి తాండవిస్తుంది. ఈస్ట్ హాస్టలులో జూనియర్ విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా 10 మంది సీనియర్ విద్యార్థులను వెంటనే హాస్టల్ నుంచి బయటకు వెళ్లమని క్యాంపస్ అధికా ర వర్గాలు ఆదేశించారు. వీరంతా డిగ్రీ 3వ సంవ త్సరపు విద్యార్థులుగా పేర్కొన్నారు. కొత్తగా చేరిన విద్యార్థలు పట్ల అసభ్య పదజాలం ప్రయోగించి కించపరిచినట్లు తలెత్తిన ఆరోపణ కింద అధికార వర్గం ఈ చర్యని చేపట్టినట్లు ఆదేశాలు పేర్కొన్న ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మలుపు తిరిగిన పరిస్థితి
ర్యాగింగ్ ఆరోపణల కింద చర్యలు చేపట్టడంతో విద్యార్థి వర్గం విజృంభించింది. వాస్తవానికి ర్యాగింగు జరగనే లేదు. బలవంతంగా తమతో ఈ ఫిర్యా దు దాఖలు చేయించినట్లు జూనియర్ విద్యార్థి వ ర్గం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ పట్ల చర్యలు ఎంత మాత్రం సమంజసం కాద ని ఆరోపణలకు గురైన సీనియర్ విద్యార్థి వర్గం ఎదురు తిరిగింది. ఈస్ట్ హాస్టలు ఆవరణలో ధర్నా కు దిగింది. క్యాంపస్ ఆవరణలో మౌనంగా నిరసన ప్రదర్శించింది. సీనియర్ విద్యార్థి వర్గానికి తాజా విద్యార్థుల వర్గం మద్దతుగా నిలిచింది. దీంతో కథ అడ్డం తిరిగింది. విద్యార్థులకు వ్యతిరేకంగా అధికా ర, యాజమాన్య వర్గం ఉద్దేశపూర్వకంగా అవాంఛనీయ చర్యలు చేపడుతోందని ఆరోపిస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ జరగలేదని ఖండించారు. ఈ వర్గం సోమవారం రెవెన్షా విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్‌కు సంతకం చేసిన లిఖిత పత్రం అందజేసింది. హాస్టల్ అధికారులు తమ సీనియర్లను తప్పుడు కేసుల్లో ఇరికించాలని ఒత్తిడి చేశారని వివరించారు. హాస్టల్ సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది తమ సీనియర్లపై ర్యాగింగ్ ఆరోపణలు చేయమని బలవంతం చేశారని ఆరో పించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వారిని హాస్టల్ నుంచి బహిష్కరణకు ఉత్తర్వుల జారీ చేశారని పేర్కొన్నారు.
శనివారం అర్ధరాత్రి జరిగిన సంభాషణలో జూనియర్లను వేధించారనే ఆరోపణలపై 10 మంది మూడో సంవత్సరం విద్యార్థులపై క్రమశిక్షణ చర్య లు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ విషయం వెల్లడైంది. విద్యార్థులను తూర్పు హాస్టల్‌ను ఖాళీ చేయమని ఆదేశించి, తాత్కాలికంగా విశ్వవిద్యాలయ అతిథి గృహంలో ఉంచారు. నిందితులైన సీనియర్లు స్నేహపూర్వకంగా, సమాచారం అందించే చర్చలో ఇరు వర్గాల మధ్య ఉల్లాసభరితంగా సంభాషణ కొనసాగుతుండగా చీఫ్ వార్డెన్ అకస్మాత్తుగా జోక్యం చేసుకుని సీనియర్లపై ర్యాగింగ్ ఆరోపణలు చేసి, శిక్షార్హమైన చర్య తీసుకున్నారని జూనియర్లు పేర్కొన్నారు. క్రమశిక్షణ చర్యలను వెంటనే రద్దు చేయాలని, సీనియర్లను హాస్టల్‌లోకి తిరిగి చేర్చుకోవాలని దరఖా స్తు డిమాండ్‌తో ఉభయ వర్గాల విద్యార్థులు పట్టుబడుతున్నారు. న్యాయసమ్మతంగా విచారణ జరిపించి తమ ప్రతిష్టను పునరుద్ధరించాలని ప్రభావిత సీనియర్ విద్యార్థి వర్గం డిమాండ్ చేస్తోంది.
ర్యాగింగ్ జరిగినట్లు ర్యాగింగు వ్యతిరేక విభాగానికి ఫిర్యాదు చేశారు. ర్యాగింగు ఫిర్యాదు పట్ల స్పందించేందుకు పని చేస్తున్న కమిటీ సిఫారసు మేరకు 10 మంది విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఫిర్యాదు వర్గం వ్యతిరేకిస్తున్నందున దర్యాప్తు జరుగుతుంది. ర్యాగింగ్ వ్యతిరేక విభాగం ఈ సమగ్ర సంఘటనపై విచారణ జరిపి పటిష్టమైన చర్యలు చేపడుతుందని రెవెన్షా విశ్వ విద్యాలయం చీఫ్ వార్డెన్ సుదర్శన మిశ్రా సోమ వారం ప్రకటించారు. క్యాంపస్‌లో శాంతియుత వాతావరణం కొనసాగించాలని విద్యార్థి వర్గాన్ని కోరింది.

రెవెన్షా హాస్టల్‌లో ర్యాగింగ్ ఆరోపణలు