
బీజేడీ ఆందోళన
రాయగడ: రాష్ట్రంలో బీజేపీ అసమర్థత పాలనకు అద్దం పట్టేలా తరచూ మహిళలపై చోటుచేసుకుంటున్న సంఘటనలకు వ్యతిరేకంగా బీజేడీ స్పందించింది. బీజేపీ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. తాజాగా బాలేశ్వర్‌లో ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మా ఝి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బరంపురంలో గల దక్షణాంచల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) కార్యాలయం ఎదుట సోమవారం బీజేడీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆ పార్టీకి చెందిన రాయగడ నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ మా జీ ఎంపీ, బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, గుణుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగో, అనసూయమాఝి తదితరులు బరంపురం ఆర్డీసీ కార్యాలయం ఘెరావ్‌లో పాల్గొన్నారు.
పర్లాకిమిడి: బాలేశ్వర్ జిల్లా ఫఖీర్ మోహన్ కళాశా ల విద్యార్థిని సౌమ్యశ్రీ మృత్యుఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బరంపురం దక్షిణ మండలం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బీజేడీ నాయకులు ప్రదీప్ మఝి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బరంపురం ఖల్లికోట్ కళాశాల గ్రౌండ్స్ నుంచి విద్యార్థి సంఘాలు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో సంజయ్ దాస్ వర్మ, గోపాల్‌పూర్ ఎమ్మె ల్యే విక్రమ్ పండా, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బిజద గజపతి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝికి రాసిన వినతిని దక్షిణ మండలం ఆర్డీసీకి అందజేశారు.

బీజేడీ ఆందోళన

బీజేడీ ఆందోళన