ఒడిశా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఒడిశా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు అరెస్టు

Jul 22 2025 6:38 AM | Updated on Jul 22 2025 9:29 AM

ఒడిశా ఎన్‌ఎస్‌యూఐ  అధ్యక్షుడు అరెస్టు

ఒడిశా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు అరెస్టు

భువనేశ్వర్‌: నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉదిత్‌ ప్రధాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణ. ఈ మేరకు స్థానిక మంచేశ్వర్‌ పోలీస్‌ ఠాణాలో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా నిందితుని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఈ ఏడాది మార్చి 18న జరిగినట్లు పోలీసు వర్గాల సమాచారం. నిందిత ఉదిత్‌ ప్రధాన్‌ తనను విందుకు ఆహ్వానించి శీతల పానీయంలో రహస్యంగా మత్తు మందు కలిపి హోటల్‌ గదిలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాల పట్ల గళం విప్పుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ అరెస్టు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఆవిష్కరించింది. ఈ పరిస్థితిపై నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ శాఖ అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర శాఖ అరెస్టు నేపథ్యంలో అత డ్ని పదవి నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు అవుతాయని స్పష్టం చేశారు. మహిళల పట్ల నేరాల్ని కాంగ్రెసు నిరంతరం వ్యతిరేకిస్తుంది. బాలాసోర్‌ ఫకీరు మోహన్‌ కళాశాల విద్యార్థిని సౌమ్య శ్రీ బిసి ఆత్మాహుతి మరణం సంఘటనపై కొనసాగుతున్న ఆందోళన నిరవధికంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్‌స్‌యూఐ అధ్యక్షుని అరెస్టు సంఘటన పూర్వాపరాల నిజనిర్ధారణ కో సం రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు సస్మిత బెహరా అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ప్రత్యేక నిజనిర్ధార ణ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ నివేదిక ఆధాంగా తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు. నిజనిర్ధారణ కమి టిలో సస్మిత బెహరా, కటక్‌ నియోజక వర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోఫియా ఫిరదౌస్‌, డాక్టరు దేవస్మిత శర్మ, సోనాలి సాహు, జయక్ష పాత్రొ, డాక్టరు మనీషా దాస్‌ పట్నాయక్‌ సభ్యులుగా ఉన్నారు.

వినతుల వెల్లువ

పర్లాకిమిడి: గజపతి జిల్లా నువాగడ బ్లాక్‌ సంబల్‌పూర్‌ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామముఖ పరిపాలన, స్పందన కార్యక్రమంలో జిల్లా అదనపు మాజిస్ట్రేట్‌ ఫల్గుణీ మఝి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్‌ పండా, జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర కెరకెటా, ప్రాజెక్టు అధికారి (ఐ.టి.డి.ఏ.) అంశుమాన్‌ మహాపాత్రో, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా పాల్గొన్నారు. నువాగడ సమితిలో పరిమళ, సుందర్‌ డంగ్‌, అనుగురు, సంబల్‌పూర్‌ పంచాయతీల నుంచి మొత్తం 30 వినతులు అధికారులకు అందాయి. వాటిలో ఒకటి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగాతా వినతులు వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఏడీఎం ఆదేశించారు. ఒకరికి ఆర్థిక సహాయం కింద రూ.5 వేలను సీఎం సహాయ నిధి నుంచి చెక్కును అందజేశారు. ఈ స్పందనలో నువాగడ సమితి అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్‌, బీడీఓ లోకనాథ్‌ శోబోరో, జిల్లా ముఖ్యవైద్యాధికారి ఎం.ఎం.ఆలీ, జిల్లా సామాజిక భద్రతా అధికారి సంతోష్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement