జయపూర్‌లో షియా ముస్లింల ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

జయపూర్‌లో షియా ముస్లింల ర్యాలీ

Jul 8 2025 4:29 AM | Updated on Jul 8 2025 4:29 AM

జయపూర

జయపూర్‌లో షియా ముస్లింల ర్యాలీ

కొరాపుట్‌: పవిత్ర మొహరం సందర్భంగా జయపూర్‌లో షియా ముస్లింలు ఆదివారం ర్యాలీ జరిపారు. పట్టణంలోని వెల్‌కం జంక్షన్‌ నుంచి ట్రాఫిక్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ జరిగింది. మహమ్మద్‌ మనుమడు ఇమామ్‌ హుస్సేన్‌తో పాటు మరో 72 మందిని హత్య కాబడిన రోజు కాబట్టి దుఖః భరితమైన కార్యక్రమంగా భావిస్తారు. మొహరం నెల షియా ముస్లిం మతస్తులకు బాధాకరమైనదిగా భావిస్తారు. శతాబ్దాల క్రితం నుంచి కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ ప్రాంతంలో షియా మతస్తులు మొహరం ప్రారంభించారు. ర్యాలీలో అధికసంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాఫ్రీ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఒడిశా శాఖ రాష్ట్ర అధ్యక్షుడు సయ్య ద్‌ హసన్‌ మదాని పాల్గొన్నారు.

పేదలకు సరుకులు పంపిణీ

రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్‌ ట్రస్టు ఆధ్వర్యం నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు బియ్యం, కందిపప్పు, దుంపలు, నూనె తదితర నిత్యావసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు. ట్ర స్టు వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్రీధర్‌ ఆచార్యులు నిరుపేదలకు ప్రతినెల ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారని ట్రస్టు నిర్వాహకురా లు ఎం.నళిని తెలిపారు.

కొండ పైనుంచి

జారి పడిన బండరాయి

రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్‌ సమి తి సెరిగుమ్మ నుంచి కొలనార సమితి దుందులికి అనుసంధానించే రహదారి మధ్యలోని కొండ నుంచి పెద్ద బండరాయి ఆదివారం సాయంత్రం జారి పడింది. దీంతో ఈ మార్గంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపొయాయి. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా కొండపై గల మట్టి జారి పడటంతో పాటు పెద్ద బండరాయి కూడా రహదారి మధ్యలోకి జారిపడింది. అటువైపుగా వెళ్లే కొందరు గ్రామస్తులు సమాచారాన్ని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడంతో సొమవారం ఉద యం కార్మికుల సహాయంతో బండరాయిని రోడ్డు పక్కకు నెట్టడంతో రాకపోకలు యఽథావిధిగా కొనసాగాయి.

ఘనంగా నవ జీవన్‌ ఆశ్రమం వార్షికోత్సవం

77 మంది వృద్ధులకు రేషన్‌ పంపిణీ

పర్లాకిమిడి: స్థానిక డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న నవజీవన్‌ అనాథశ్రమం 18వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జువెనెల్‌ ప్యాలన్‌ జడ్జి భాగ్యలక్ష్మీ నాయక్‌, విశ్రాంత ఉపాధ్యాయులు బినోద్‌ జెన్నా, దాతలు గణేష్‌ పట్నాయక్‌, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు హాజ రయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్రీధర్‌ ఆచార్య 76వ జన్మదినం పురస్కరించుకుని అనాథశ్రమంలో బాలబాలికలతో కేకు కట్‌ చేయించారు. అనంతరం అన్నలక్ష్మి పథకం కింద 77 మంది అనాథ వృద్ధులకు 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అతిథులు పంపిణీ చేశారు. ట్రస్టు చీఫ్‌ మేనేజర్‌ ఎస్‌.వి.రమణ, హౌస్‌ మదర్‌ ప్రభాషిణీకుమారి లిమ్మా, జయలక్ష్మి, బాబూరావు పాల్గొన్నారు.

పరిశోధనలపై దృష్టి సారించాలి

ఎచ్చెర్ల: వర్సిటీ అధ్యాపకులు పరిశోధనా రంగంపై దృష్టి సారించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ కె.ఆర్‌.రజనీ సూచించారు. పూనేలోని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ సంస్థ ప్రచురించిన ‘సౌత్‌ ఆసియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పార్టిసిపేటివ్‌ డవలప్‌మెంట్‌’ ప్రత్యేక సంచికను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధన, అధ్యయన రంగాల్లో సాధించిన ప్రగతి వర్సిటీ పురోగతికి దోహదపడుతుందని తెలిపారు. యూజీసీ గుర్తింపు పొందిన జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో వారు తమ పరిశోధన పత్రాలను ప్రచురించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఏయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ అడ్డయ్య, సెమినార్‌ కన్వీనర్‌ డాక్టర్‌ యు.కావ్యజ్యోత్స్న, వాసవ్య మహిళా మండలి డైరక్టర్‌ డాక్టర్‌ రష్మి, వైసీబీ డైరెక్టర్‌ ఎం.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

జయపూర్‌లో  షియా ముస్లింల ర్యాలీ 1
1/3

జయపూర్‌లో షియా ముస్లింల ర్యాలీ

జయపూర్‌లో  షియా ముస్లింల ర్యాలీ 2
2/3

జయపూర్‌లో షియా ముస్లింల ర్యాలీ

జయపూర్‌లో  షియా ముస్లింల ర్యాలీ 3
3/3

జయపూర్‌లో షియా ముస్లింల ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement