
దేవతా మూర్తులకు స్వర్ణాలంకరణ
జయపురం: చైతన్యమందిరం నుంచి శ్రీజగన్నాథ్, బలభద్ర, సుభద్రలతో ఉన్న పెద్ద రథం, పతిత పావనుడు ఉన్న చిన్న రథాలు రాత్రి 8.00 గంటలకు రథొపొడియ వద్దకు చేరాయి. దాదాపు రాత్రి పదకొండు వరకు భక్తుల పూజలు అందుకున్న దేవతా మూర్తులను జగన్నాథ ఆలయానికి తీసుకు వచ్చారు. లక్ష్మీదేవి అనుమతితో గర్భగుడిలోకి వెళ్లాక స్వర్ణాలంకరణ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ విభాగ అదనపు తహసీల్దార్ చిత్త రంజన్ పట్నాయిక్, జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్,జ యపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్‌లతో పాటు దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు.

దేవతా మూర్తులకు స్వర్ణాలంకరణ