
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
● ప్రసవ ‘వే’దన
మల్కన్‌గిరి జిల్లాలొని ఖయిరొపుట్ సమితి బొండాఘాటి వద్ద సోమవారం ఓ గర్భిణిని డోలీపై పది కిలోమీటర్లు మోసుకెళ్లారు. సమితిలొని భొజ్‌గుడ గ్రామంలో నివసిస్తున్న రంజ్ భొజొ భార్య సునాయి భొజ్ నిండు గర్భవతి. నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆశ కార్యకర్త అంబులెన్స్‌కు సమాచారం అందించింది. అయితే గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ ఉండిపోవాల్సి వచ్చింది. గత్యంతరం లేక గర్భవతిని గ్రామస్తులు డోలీపై మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చారు. అనంతరం గర్భిణిని ఖయిరాపుట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. గర్భిణి మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
– మల్కన్‌గిరి
న్యూస్‌రీల్

మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025