
జయపూర్‌ను కార్పొరేషన్‌గా మార్చాలి
జయపూర్‌కి అన్ని అర్హతలు ఉన్నాయి
రాజరిక జయపూర్‌కు కార్పొరేషన్ హోదా కల్పించాలి. కార్పొరేషన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు జయపూర్ పట్టణానికి ఉన్నాయి. మహా రాజులు, రాజులు, సామంతులు శతాబ్దాల క్రితమే దీన్ని నగరంగా గుర్తించారు. కార్పొరేషన్‌గా మార్చా లని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. ఇది చాలా కాలంగా వస్తున్న డిమాండ్. వీలైనంత తర్వలో కార్పొరేషన్‌గా ప్రకటన చేయాలి.
–తారా ప్రసాద్ బాహనీ పతి,
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జయపూర్
కొరాపుట్: ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న జయ పూర్ పట్టణాన్ని కార్పొరేషన్‌గా హోదా పెంచాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమా ండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అయితే కొద్దిరోజుల క్రితం పూరీ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో చిరకా లంగా కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్న బాలేశ్వర్, జయపూర్ ప్రజలు కూడా తమ పట్టణాలను కూడా కార్పొరేషన్ హోదా కల్పించాలనే డిమాండ్‌ను తీవ్రం చేశారు. కేవలం పూరీని మా త్ర మే కార్పొరేషన్ చేస్తారా.. జయపూర్ సంగతి ఏమి టని ప్రశ్నిస్తున్నారు. సుమారు నాలుగు శతాబ్దాల క్రితం సూర్యవంశీయులు జయపూర్‌ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. నాటి పురాతన నగ రం కార్పొరేషన్‌కి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా యని ప్రముఖులు పేర్కొంటున్నారు. దక్షిణ ఒడిశా లో బ్రహ్మపుర తర్వాత జయపూర్ పెద్ద పట్టణం. అవిభక్త కొరాపుట్ జిల్లాలో అతి పెద్ద పట్టణం జయ పూరే. ఈ పట్టణంలో ప్రస్తుతం 28 వార్డులు ఉండ గా పెరిగిన జనాభా దృష్యా త్వరలో వార్డుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుత జనాభా రెండు లక్షలకు చేరువలో ఉంది. జయపూర్‌ని కార్పొరేషన్ చేయాలనే ఉద్యేశంతో గతంలో ప్రభుత్వం రెండుసార్లు సర్వే కూడా చేసింది. సమీప భరణీపుట్, ఏక్తాగుడ, ఉమ్రి తదితర ప్రాంతాలను కలుపుతూ కార్పొరేషన్ చేయాలని నాటి సర్వేలో ప్రజలు వివరాలు అందించారు. 1953లోనే పురపాలక సంఘం ఏర్పడింది. పూరీ ప్రకటన నేపథ్యంలో గత రెండు రోజులుగా రాజకీయాలకు అతీతంగా డిమాండ్ పెరిగింది.
రాజకీయ పక్షాల డిమాండ్
తక్షణమే ప్రకటించాలి
కేవలం పూరీని మాత్రమే కార్పొరేషన్ చేయడం తగ దు. అలా చూస్తే జయపూ ర్ కూడా పురాతన నగరమే కదా. కార్పొరేషన్ హోదా కోసం ఇప్పటికే రెండుసార్లు అధికారులు సర్వే లు కూడా చేశారు. కావాలంటే మరోసారి సర్వే చేయండి. జయపూర్‌ని కార్పొరేషన్‌గా తక్షణం ప్రభుత్వం ప్రకటించాలి.
–బీ.సునీత, మున్సిపల్ వైస్ చైర్మన్,
బీజేడి

జయపూర్‌ను కార్పొరేషన్‌గా మార్చాలి

జయపూర్‌ను కార్పొరేషన్‌గా మార్చాలి