
అనుమతి లేని దుకాణాల కూల్చివేత
కొరాపుట్: పాఠఽశాలల పరిసరాల్లో పారిశుద్ధ్యానికి జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సశ్యరెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా కొరాపుట్ పట్టణంలోని ఎన్‌కేటీ రోడ్డు చివర బాయ్స్ హైస్కూల్ ప్రాంతంలో కఠిన చర్యలకు దిగారు. అక్కడ అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న మాంసాహార దుకాణాలను ఆదివారం కూల్చి వేశారు. వీటి నిర్వహణ వలన తీవ్ర దుర్గంధం ఏర్పడి బాలలు అనారోగ్యం పాలవుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ స్వయంగా రంగంలో దిగి కూల్చివేతలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పొలీసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

అనుమతి లేని దుకాణాల కూల్చివేత