
తెలంగాణ పేలుడులో నబరంగ్‌పూర్ వాసులు
కొరాపుట్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేలుడులో ఇద్దరు జిల్లా వాసులు మృతి చెందారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితిలో అనేక గ్రామాలకు ఈ సమాచారం వచ్చింది. సంగారెడ్డి జిల్లా పాశమైలవరం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి సుమారు 45 మంది మృతి చెందారు. ఇదే పరిశ్రమలో నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం సమితి కొడాబెట్ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ (30), చైతు బోత్ర (31) లు మృతి చెందారని సమాచారం వచ్చింది. సమితిలో కోడాబెట్ గ్రామంతో పాటు బుబాలిబెధ, పరసాల గ్రామాలకు చెందిన అనేక మంది యువకులు ఇదే పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కొడాబెట్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులలో ఇద్దరు మాత్రమే పనికి వెళ్లారు. వారి మృతదేహాలను అక్కడ మార్చురీలో ఉంచినట్లు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. మృతుల బంధువుల డీఎన్‌ఏ కావాలని సమాచారం రాగా ఇక్కడ నుండి కొందరు యువకులు సంగారెడ్డి బయలు దేరి వెళ్లారు.

తెలంగాణ పేలుడులో నబరంగ్‌పూర్ వాసులు