
కొరాపుట్ జిల్లాలకు సముచిత స్థానం
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల ప్రజలకు రాజధానిలో సుముచిత స్థానం ఉంటుందని సీఎం మోహన్‌చరణ్ మాఝి అన్నారు. గురువారం రాజధానిలోని శబరి సాంస్కృతి సంసద్ సంస్థ ద్వారా నిర్మితమైన సాహిద్ భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలైన కొరాపుట్, నబరంగ్‌పూర్, రాయగడ, మల్కన్‌గిరి జిల్లాల ప్రజలకు ఈ భవనం ఎన్నోవిధాలుగా ఉపయెగపడుతుందన్నారు. శబరి అంటే సవర అనే పదం నుంచి మార్పు అన్నారు. అటువంటి శబరి పేరు భవనానికి ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. అనేక గిరిజన సంస్కృతులు, కళలకు ఈ జిల్లాలు నిలయాలని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రి నిత్యానంద గోండో, ఎంపీలు మున్నాఖాన్, బలభద్ర మజ్జి, మాజీ మంత్రులు రమేష్ చంద్ర మజ్జి, జగన్నాథ సారక, ఎమ్మెల్యేలు తారాప్రసాద్ బాహీణీపతి, గౌరీ శంకర్ మజ్జి, నర్సింగ్ బోత్ర, రుపుధర్ బోత్ర, రఘురాం మచ్చో, అప్పలస్వామి కడ్రక, నీలమాధవ్, మడ్కామి తదితరులు పాల్గొన్నారు.
సీఎం మోహన్‌చరణ్ మాఝి

కొరాపుట్ జిల్లాలకు సముచిత స్థానం