
ముఖ్యమంత్రిని కలిసిన పాత్రికేయ ప్రతినిధులు
భువనేశ్వర్: ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ మీడియా ప్రతినిధులు లోక్ సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిశారు. ఈ సందర్బంగా రథ యాత్ర సమయంలో తాము ఎదుర్కొన్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ భువనేశ్వరులో గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులను ప్రతి సంవత్సరం పూరీకి తీసుకెళ్లి రథ యాత్రను కవరు ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది యాత్ర కవరేజి కార్యకలాపాల్లో మీడియా ప్రతినిధులు పూరీలో వివిధ సమస్యలను ఎదుర్కొన్నారని ఈ బృందం ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించింది. ఈ విషయంపై చర్చించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ చర్చలో సీనియర్ పాత్రికేయులు సనత్ మిశ్రా, ప్రద్యుమ్న కుమార్ మహంతి, భగవత్ త్రిపాఠి, పవిత్ర మోహన్ సామంతరాయ్, పార్థ సారథి జెనా, కిషోర్ మంగరాజ్, దేబకాంత్ మహపాత్రో, స్వరూప్ కుమార్ మహంతి, గజేంద్రనాథ్ బెహెరా, సనాతన్ దొలొబెహెరా, సుబోధ్ కనుంగో, సూర్యకాంతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.