
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి పాయికొడాకులుగుడ గ్రామ సమీపంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. మృతులు సమితి లొని డిమిరినెలికు గ్రామానికి చెందిన మనోజ్ సరక (30), గహా హుయిక (28)గా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. డిమిరినెలికు గ్రామానికి చెందిన మనోజ్, గహా, హడి పిడికకలు ఒకే బైకుపై తమ గ్రామం నుంచి మునిగుడ వెళ్తున్న సమయంలొ పాయికొడాకులుగుడ గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పి రోడ్డుకు పక్కనే ఉన్న ఒక చెట్టును బలంగా ఢీకొంది. ఈ ఘటనలొ ఇద్దరు సంఘటన స్థలం వద్దే మృతి చెందగా హడి పిడికక గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.