
పొలం వద్దకే మన్ కీ బాత్
కొరాపుట్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమం పొలం పనుల వద్దకు చేరింది. ఆదివారం మాన్ కి బాత్ 123వ ఏడిషన్ జరిగింది. నబరంగ్‌పూర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో రైతులు ఖరీఫ్ పనుల్లో బిజీగా ఉన్నారు. వేకువ జామున ఇంటి నుంచి పొలాలకు వెళ్లి తిరిగి రాత్రికి వస్తున్నారు. ప్రధాని సందేశం గిరిజనులకు అందాలనే ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలు వినూత్న ఆలోచన చేశారు. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితిలో ల్యాప్ ట్యాప్‌ను పొలం వద్దకు తీసుకువెళ్లి మాన్ కి బాత్ కార్యక్రమాన్ని వినిపించారు.

పొలం వద్దకే మన్ కీ బాత్