
రాష్ట్రంలో విపత్తు నిరోధక రోడ్ల నిర్మాణం
భువనేశ్వర్: వరదలు, తుఫాన్లకు గురయ్యే ప్రాంతాలలో 500 కిలోమీటర్ల పొడవునా విపత్తు నిరోధక రహదారులను నిర్మించడానికి రాష్ట్ర మంత్రి వర్గం రూ.1,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాల నవీకరణలకు రూ. 426 కోట్ల వ్యయ ప్రణాళికను ఆమోదించింది. ముఖ్య మంత్రి సడక్ యోజన కింద ఈ ప్రాజెక్ట్‌ని 2025 – 2030 పంచ వర్ష ప్రణాళికగా పరిగణించారు. విపత్తు వంటి అత్యవసర పరిస్థితుల్లో నిరంతర రాకపోకల అనుసంధానం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పేర్కొన్నారు. వరద స్థాయిల కంటే ఎత్తుగా బలోపేతమైన రక్షణ గోడలతో పటిష్టమైన నీటి ప్రవాహ వ్యవస్థతో కోతకు గురవుతున్న ప్రాంతాల్లో విపత్తు నిరోధక రహదారులను నిర్మిస్తారు. కొండ చరియలు జారిపడే వాలు ప్రాంతాల్లో ఈ తరహా రహదారుల నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకుంది.
142 నియోజకవర్గాల్లో గ్రామీణ రోడ్ల అభివృద్ధి
రానున్న మూడేళ్లలో 142 అసెంబ్లీ నియోజక వర్గాలలో గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ. 426 కోట్ల వ్యయ ప్రణాళికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లకు రహదారి అనుసంధానం మెరుగుపరచడం ఈ ప్రతిపాదన లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం 5 విభాగాల 8 ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది.
మంత్రి మండలి ఆమోదం పొందిన ప్రతిపాదనలు
● బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం అమలు.
● ప్రజారోగ్య సౌకర్యాలలో అనుబంధ సేవలను బలోపేతం చేసేందుకు నిర్మల్ 2వ దశను 5 సంవత్సరాల పాటు కొనసాగింపు.
● 5 సంవత్సరాల పొడిగింపుతో నిదాన్ 2వ దశ కింద ఉచిత రోగ నిర్ధారణ, డయాలసిస్ సేవలు.
● నియోజకవర్గాల వారీగా కేటాయింపు (సీడబ్ల్యూఏ) కొత్త పథకం అమలు.
● కొత్త పథకం ‘ముఖ్య మంత్రి సడక్ యోజన – విపత్తు తట్టుకునే రోడ్లు‘ అమలు.
● ఓసీఎస్ (ఫించను) నియమాలు, 1992 లో సవరణ.
● ఒడిశా వెటర్నరీ టెక్నికల్ సర్వీస్ (నియామక, సేవా నిబంధనలు) నియమాలు, 2024 అమలు.
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి బస్ సేవ (ఎంబీఎస్) అమలు ప్రతిపాదనకు ఆమోదించింది. ఈ ఆమోదంతో ఎంబీఎస్ కింద నడిచే ఏసీ, నాన్–ఏసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, హిజ్రాలు, విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ లభిస్తుంది.
రూ. 1,500 కోట్లు వ్యయ ప్రణాళిక
మంత్రి మండలి ఆమోదం