
సైబర్ మోసగాళ్ల అరెస్టు
భువనేశ్వర్: సైబర్ మోసాలకు పాల్పడిన నిందితులు పోలీసులకు చిక్కారు. కటక్ సైబర్ ఠాణా పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి రూ. 78 లక్షల విలువైన సామగ్రితో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా బొలంగీరు ప్రాంతీయులుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరి దగ్గర నుంచి రూ. 12 లక్షల నగదు, చెక్ పుస్తకాలు, పాస్‌బుక్‌లు, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఇంటి పనిమనిషి, ఆమె కుమార్తైపె లైంగికదాడి
భువనేశ్వర్: నగరంలోని ఓ ఇంటి పనిమనిషిపై యజమాని లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో బొడొగొడొ ఠాణా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుని విచారణలో ఆరోపణ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటిలో పనిచేస్తున్న మహిళ, ఆమె మైనర్ కుమార్తైపె అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణ. ఇంట్లో పని చేసే సమయంలో తల్లీ కూతుళ్ల వ్యక్తిగత దృశ్యాలను రహస్యంగా వీడియో చిత్రీకరించి ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగాడు. వీడియోలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తానని బెదిరించాడు. అనంతరం వీరివురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత వర్గం స్థానిక ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని సరోజ్ కుమార్ బెహరాగా గుర్తించారు. నిందితుని వ్యతిరేకంగా జాజ్‌పూర్ ప్రాంతంలో అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
భారీగా బయటపడిన అక్రమాస్తులు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి సీడీపీఓ శకుంతల దాస్ తన కిందిస్థాయి ఉద్యోగిని వద్ద రూ.10 వేలు లంచం తీసుకొని పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ ఘటన అనంతరం ఆమె ఆస్తుల వివరాలు కోసం విజిలెన్స్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి నివ్వెర పొయారు. ఆమెకు భుబనేశ్వర్‌లో అతి ఖరీదైన ప్రాంతం డుముడుమాలో 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల భవనం, కొరాపుట్ జిల్లా సిమిలిగుడ లో రెండస్తుల భవనం, పూరీలో నిర్మాణంలో ఉన్న భవనం, సిమిలిగుడలో జాగా, రూ.78 లక్షల విలువ గత బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. శకుంతలదాస్‌ని జయపూర్ విజిలెన్స్ కార్యాలయం నుంచి కోర్టుకి తరలించేటప్పుడు పోలీసుల వ్యాన్ ఎక్కేముందు తన ఆస్తులు కూడా కనుగొని విజిలెన్స్ వారు సీజ్ చేశారని తెలిసింది.
దిఘా జగన్నాథ ఆలయ
వివాదంపై దర్యాప్తు
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్ దిఘాలో కొత్తగా నిర్మించిన జగన్నాథ ఆలయంపై రగులుతున్న వివాదాలపై బిజూ జనతా దళ్ (బీజేడీ) రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. దిఘా వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దర్యాప్తుపై బీజేడీ నాయకుడు ప్రసన్న ఆచార్య ప్రశ్నలు లేవనెత్తారు. గత ఏడాది 2024లో పూరీలో జరిగిన రథయాత్రలో బలభద్రుని విగ్రహం కూలిపోవడంతో సహా అనేక విచారకర, అశుభ సంఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఈ సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దర్యాప్తు ఫలితాలను బహిర్గతం చేయాలని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో నబకలేబార్ వేడుక నుంచి మిగులు కలప (పవిత్ర దారు)ను దిఘాలోని కొత్త మందిరం విగ్రహాల తయారీకి ఉపయోగించారనే ఆరోపణలపై బీజేడీ ఉపాధ్యక్షుడు ప్రసన్న ఆచార్య ఒడిశా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విషయాల్ని తెరపైకి తెచ్చారు.