జయపురం: విశ్వహిందూ పరిషత్ పటిష్టతకు అందరూ కృషి చేయాలని వక్తలు కోరు. వీహెచ్‌పీ పరిషత్ పశ్చిమ ప్రాంత సమావేశాన్ని స్థానిక శారదా విహార ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో మఠ మందిర, విద్యాలయ ప్రముఖులు హరిశంకర జీ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలపై పశ్చిమ ప్రాంత కార్యదర్శి భక్త చరణ దాస్ వివరించారు. వీహెచ్‌పీని మరింత బలోపేతం చేసేందుకు పరిషత్ సభ్యులు కృత నిశ్చయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మాతృశక్తి, దుర్గా వాహిణీలను ఏర్పాటు చేయాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్‌లో మహిళాశక్తిని జాగృతి పరచాలని పిలుపు నిచ్చారు. త్వరలో రాబోతున్న హిందూ నూతన సంవత్సరం, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిలను ఘనంగా జరపాలని అందుకు సభ్యులందరికీ ఏకం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ పశ్చిమ ప్రాంత సాధారణ కార్యదర్శి భక్త చరణ దాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణ అనాపతి, ప్రాంత ఉపాధ్యక్షులు బాబా భొయి భజరంగబలి, జయపురం విభాగ కార్యదర్శి నవకృష్ణ రథ్, ప్రాంత ప్రచార, ప్రసారవిభాగ సభ్యలు సాధూ చరణ దాస్ చౌదరి, జయపురం జిల్లా ప్రచార విభాగ దుర్యోధన మాలిలతో పాటు నవరంగపూర్, మల్కన్‌గిరి ప్రాంతాల నుంచి వీహెచ్‌పీ ప్రతినిధులు పాల్గొన్నారు.