రాయగడ: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై జిల్లాలోని గుణుపూర్ ఆదర్శ పోలీసులు కొరడా ఝులిపించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ఖనిజ, వాణిజ్య శాఖల మంత్రి బిభూతి జెన్న ఇటీవల రాయగడ జిల్లాలో పర్యటించిన సందర్భంగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న వంశధార నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 13 ట్రాక్టర్లను సీజ్ చేసి, దీనికి సంబంధించి 12 కేసులు నమోదు చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చైన్ స్నాచింగ్
భువనేశ్వర్: పట్టపగలు నడి రోడ్డు మీద చైన్ స్నాచింగ్ జరిగిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఈ మేరకు స్థానిక బొడొగొడొ పోలీసు ఠాణాలో శుక్రవారం ఫిర్యాదు దాఖలైంది. నగరంలో బ్లాక్ పల్సర్ బైక్‌పై హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చైన్ తెంచుకొని పరారైనట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఘటనతో నగరంలో భయాందోళన నెలకొంది.
భారీగా గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి సరిగడ అటవీ ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 1,020 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ముగ్గురు నిందితులను అరె స్టు చేశారు. నిందితులను శుక్రవారం కోర్టుకు తరలించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంబులెన్స్‌ను ఢీకొన్న ట్రక్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి సింద్రిమాల గ్రామం వద్ద గురువారం రాత్రి మృతదేహంతో వస్తున్న అంబులెన్స్‌ను ఓ ట్రక్ ఢీకొట్టింది. ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్కన్‌గిరి సమితి ఎంవీ 43 గ్రామానికి చెందిన శాంతి మండాల్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో మల్కన్‌గిరి ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థి తి విషమించడంతో బరంపురం ఆస్పత్రికి రిఫ ర్ చేశారు. సోమవారం అక్కడకు తరలించగా గురువారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తుండగా మల్కన్‌గిరి నుంచి జయపురం వస్తున్న ఓ ట్రక్ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న తల్లీకొడుకులు, డ్రైవర్‌కు గాయాలయ్యా యి. ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
13 ఇసుక ట్రాక్టర్లు సీజ్
13 ఇసుక ట్రాక్టర్లు సీజ్
13 ఇసుక ట్రాక్టర్లు సీజ్