తిండి గింజలు లేక ముగ్గు పిండిని తింటున్న ఊర పిచ్చుకలు
● కిచకిచల మనుగడకు ముప్పు
● నేడు ప్రపంచ
పిచ్చుకల దినోత్సవం
పర్యావరణ పరిరక్షకులైన, చిరుప్రాణులైన పిచ్చుకలను మానవత్వంతో ఆదరించాలి. బంగారు పిచ్చుకలను పెంచవలసిన బాధ్యత పెరిగింది.అరు బయట తిండి గింజలు వేయడం, చూరుపై చిన్న చిన్న కప్పులతో నీటిని పెట్టడం, ఇంటి సన్‌స్లేడ్‌లపై ఖాళీలలో పెట్టిన గూళ్లను కాపాడడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో సెల్‌టవర్స్ ఏర్పాటు లేకుండా రేడియేషన్‌కు దూరం చేయాలి. పిచ్చుకలు తినడంతో తిండి గింజలు నష్టపోతున్నామనే అపొహ విడనాడాలి. పంటపై పడిన కీటకాలు,పురుగులను పిచ్చుకలు తిని రైతుకు మేలు చేస్తాయి.
డాక్టర్ జీఎన్‌నాయుడు, పీహెచ్‌డీ, జువాలజీ, భామిని
పిచ్చుకలు అంతరించి పోకుండా కాపాడాలి
ఒకప్పుడు పల్లెల్లో గుంపులు గుంపులుగా సందడి చేస్తూ కనిపించే పిచ్చుకలు క్రమేపీ అంతరించిపోతున్నాయి.పర్యావరణ సమతౌల్యం కాపాడడంలో పిచ్చుకలు ముఖ్య భూమిక వహిస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. సెల్ టవర్స్ దూరంగా ఉండేలా చూడాలి. మనతో సహజీవనం చేసే పిచ్చుకలను స్నేహితులుగా భావించి రక్షించుకోవాలి.
కేవీ రమణమూర్తి, సీఈఓ,
గ్రీన్‌మెర్సీ సంస్థ, శ్రీకాకుళం
భామిని: ఇంటి చూర్లు, లోగిళ్లలో నివాసంతో ఇంటిల్లిపాదికి పిచ్చుకలు ఆనందం పంచేవి. మనుషుల మధ్య మమేకమై సహజీవనం సాగించేలా మనముందే ఎగురుతూ అలరించేవి. నేలబావులపైన వాలిన చెట్లుపైన, పొదలు తుప్పలపైన, ఇంటి ముంగిళ్లలో ఊగిసలాడుతూ అందమైన పిచ్చుక గూళ్లు నిర్మించేవి. అపరూపమైన కళానైపుణ్యంతో నిర్మించిన పిచ్చుక గూళ్లు ఆధునిక ప్రపంచంలోనూ గృహనిర్మాణాలకు ఉదాహరణగా మారాయి. పూరింటి చూరుపై కట్టిన గూళ్లపై వాలుతూ ఊగుతూ, వేలాడుతూ కిచకిచ రావాలతో అలరించేవి.
తల్లి ప్రేమకు రుజువు
జంటకట్టిన పిచ్చుకల జత చెట్ల ఆకులనుంచి తెచ్చిన మొత్తని నార పీచుతో అల్లి నిర్మించిన పిచ్చుక గూళ్ల నిర్మాణం, రక్షణ వలగా మారిన గూళ్లలో గుడ్లు పెట్టి, పిల్లలు పుట్టే వరకు పొదగడం, దగ్గరుండి వాటిని సంరక్షించడంలో దిట్టగా కనిపించచేవి. ఏరి తెచ్చిన గింజలను పిల్లల నోటికి అందిస్తూ తల్లి ప్రేమకు రుజువుగా నిలిచేవి. పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించడం అన్యోన్యమైన జీవన విధానం ప్రతిబంబించేవి.
ఆధునికత రూపంలో..
పర్యావరణ హితులైన పిచ్చుకల జీవనంపై ఆధునికత వేటు వేస్తోంది. విద్యుత్ రూపంలో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు గూళ్ల నిర్మాణాలకు అడ్డుకట్ట వేశాయి.సెల్ టవర్ల నుంచి ఉద్భవించే రేడియేషన్ పునరుత్పత్తి లేకుండా చేశాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో కళ్లాల్లో తిండి గింజలు కరువై జీవనం కష్టమైంది. వరిచేను కుప్పలు, ధాన్యం రాశులు తగ్గిపోవడం పిచ్చుకల మనుగడకు కష్టంగా మారింది. కాంక్రీట్ భవనాలు పిచ్చుకల వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. ధాన్యం నిల్వలు లేకుండా పోవడం, పంటచేలపై క్రిమి సంహారక మందులు పిచ్చుకల మనుగడకు కష్టంగా మారుతున్నాయి.
మానవత్వంతో
ఆదరించాలి
పిచ్చుకపై.. బ్రహ్మాస్త్రాలు..!