2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Mar 20 2025 1:06 AM | Updated on Mar 20 2025 1:05 AM

రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీసులు మంగళవారం రాత్రి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మునిగుడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలకుబుజు గ్రామం సమీపంలోని ప్రయాణికుల విశ్రాంతి గృహం వద్ద బస్తాలు పడి ఉండటం గమ నించిన పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు వాటి ని పరిశీలించి ఆశ్చర్యపోయారు. అందులో 2.61 క్వింటాళ్ల గంజాయి బయట పడింది. ఐఐసీ సౌదా మిని బెహర తెలియజేసిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచా రం మేరకు పోలీస్‌ పెట్రోలింగ్‌ ముమ్మరం చేశామ న్నారు. ఈ క్రమంలో బాలకుబుజు గ్రామ సమీపంలో బస్తాలు ఉండటం గమనించిన పోలీస్‌ సిబ్బంది ఈమేరకు తనిఖీలు నిర్వహించి గంజాయిని గుర్తించారని చెప్పారు. అయితే గంజాయి అక్రమ రవాణా చేసే వ్యక్తులు మాత్రం పట్టుబడలేదన్నారు. కే సు నమెదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనంపై..

ద్విచక్ర వాహనంపై గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రాయగడ జిల్లా పద్మపూర్‌ పోలీ సులు పట్టుకున్నారు. అతని నుంచి 28.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పద్మపూర్‌ ఐఐసీ ధరణీధర్‌ ప్రధాన్‌ తెలియజేసిన వివరాల ప్రకారం.. జిల్లా ఎస్‌పీ స్వాతి ఎస్‌ కుమార్‌ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తరణంలో పద్మపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శారదాపూర్‌–పద్మపూర్‌ కూడలిలో వాహన తనిఖీలను మంగళవారం నాడు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి బైకుపై బస్తాను తీసుకొని రావడాన్ని గుర్తించా రు. అనుమానంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయ గా బస్తాలో గంజాయి పట్టుబడింది. నిందితుడు గజపతి జిల్లా ఆర్‌ ఉదయగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంగురు గ్రామానికి చెందిన దేవాశీష్‌ మండలిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

344 కిలోల గంజాయి పట్టివేత

పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ రోడ్డు వద్ద బుధవారం అబ్కారీ శాఖ పెట్రోలింగ్‌ చేస్తుండగా ఒక బజాజ్‌ ఆటోలో ఎనిమిది బస్తాల గంజాయి పట్టుబడింది. గజపతి ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీప్‌ కుమార్‌ సాహు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాయగడ రోడ్డు చెక్‌పోస్టు వద్ద తమ సిబ్బంది తనిఖీలు చేపట్టగా ఓ ఆటోలు కొన్ని బస్తాలు ఉండటాన్ని గమనించారు. దీంతో అనుమానంతో వాటిని పరిశీలించగా.. ఎనిమిది బస్తాల్లో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారన్నారు. వాటిని తూకం వేయగా 344 కిలోలు ఉన్నట్టు తేలిందన్నారు. దీని విలువ మార్కెట్‌లో రూ.35 లక్షలు ఉంటుందన్నా రు. పట్టుబడిన ఆటో డ్రైవర్‌ మోహానా బ్లాక్‌ బోడసింధిబా గ్రామానికి చెందిన కమల్‌ లోచన్‌ మఝిగా గుర్తించి అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. దాడుల్లో అబ్కారీ శాఖ మొబైల్‌ యూనిట్‌ ఎస్సై దుర్యోధన దిగాల్‌ ఉన్నారు.

2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం 1
1/3

2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం 2
2/3

2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం 3
3/3

2.61 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement