రైలు నుంచి జారిపడి వలస కార్మికుడి మృతి
రాయగడ: కై కలూరు–భీమవరం రైల్వేస్టేషన్ మధ్య ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు సదరు సమితి పరిధిలోని పిపలగుడ పంచాయతీ కొడాపాడు గ్రామానికి చెందిన భరేంద్ర కొండగిరి(40)గా గుర్తించారు. నెల రోజుల క్రితం ఉపాధి కోసం మిత్రులతొ కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు వెళ్లాడు. పనులు ముగించుకుని మంగళవారం రైలులో ఇంటికి బయలు దేరాడు. కై కలూరు –భీమవరం రైల్వే స్టేషన్ మధ్య ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పొయాడు. గేటు వద్ద నిల్చుని ఉండగా జారిపడినట్లు తెలిసింది. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
రత్న భాండాగారం తాళం గల్లంతు
● ప్రభుత్వ వివరణ కోరిన రాష్ట్ర హైకోర్టు
● వచ్చే వారం తదుపరి విచారణ
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తాళాల గల్లంతు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. రత్న భాండాగారం తాళాల గల్లంతుపై జరిగిన న్యాయ విచారణ నివేదికని బహిరంగపరచాలని రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అఫిడవిట్లు దాఖలు చేసింది. ఈ రెండింటిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించడంతో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఖరారు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జనవరి 29న ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్‌లో రత్న భాండాగారం తాళాల గల్లంతుపై న్యాయ విచారణ నివేదికను బహిరంగపరచకూడదని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే సంవత్సరం ఏప్రిల్ 5న దాఖలు చేసిన రెండవ అఫిడవిట్‌లో, ప్రభుత్వం నివేదికను బహిరంగపరచడానికి అంగీకరించిందని పేర్కొంది. బుధవారం కొనసాగిన విచారణ పురస్కరించుకుని హైకోర్టు రెండు అఫిడవిట్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత కోరింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే వారం జరగనుంది. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ అప్పటి బిజూ జనతా దళ్ ప్రభుత్వంపై మండిపడిన సంగతి తెలిసిందే. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఈ అంశాన్ని ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా సంధించింది. ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలి సారిగా పాలన పగ్గాలు చేపట్టింది. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రత్న భాండాగారం తాళాలు గల్లంతు వ్యవహారం నిగ్గు తేల్చుతామని బీజేపీ ప్రకటించింన సంగతి తెలిసిందే.
అబ్కారీ దాడులపై ఆగ్రహం
జయపురం: జాముండ గ్రామంలో గ్రామపెద్ద బి.దంతేశ్వరరావు ఇంట్లో నాటుసారా ఉందంటూ బొరిగుమ్మ అబ్కారీ విభాగం అధికారులు, సిబ్బంది దాడులు చేయడంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. అందరినీ కొట్టి భయంకర వాతావరణం సృష్టించడం తగదంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై గ్రామస్తులంతా కలిసి బొరిగుమ్మ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి జరిపిన సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
2
కొరాపుట్:
పాన్ ఇండియా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌బాబు, ప్రియాంకచోప్రా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ–29’(వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ కొరాపుట్ జిల్లాలో ముగిసింది. నెల రోజులుగా ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. మంగళవారంతో షెడ్యూల్ ముగియడంతో అదే రోజు రాత్రి కొంతమంది నటీనటులు, సిబ్బంది వెనుదిరగగా.. బుధవారం ఉదయం రాజమౌళి, ప్రియాంకచోప్రా, మిగిలిన సాంకేతిక బృందం వీడ్కోలు పలికింది. షెడ్యూల్ ముగిసిందనే సమాచారం తెలుసుకున్న పరిసర ప్రాంత అభిమానులు వేకువజామునే కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలో రాజమౌళీ బృందం బస చేసిన హోటల్‌కు పోటెత్తారు. సిమిలిగుడ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రియాంక చోప్రాతో కలిసి ఫొటోలు దిగారు.
కదిలిన కాంగ్రెస్ శ్రేణులు..
షెడ్యూల్ మొత్తం పొట్టంగి నియోజకవర్గంలోనే జరిగింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌చంద్ర ఖడం నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ శాసన సభాపక్షనేతగా ఉన్నారు. దాంతో ఖడం నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, జిల్లా పరిషత్ సభ్యులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. కొరాపుట్ జిల్లాలో పండించిన నల్ల ధాన్యం, కొరాపుట్ కాఫీ తదితర మిలెట్స్‌తో కూడిన బాక్స్‌ను రాజమౌళికి బమూకరించారు. మరోసారి ఇదే ప్రాంతంలో షూటింగ్‌కి రావాలని ఆహ్వానించారు. ఎప్పుడు ఎవరు షూటింగ్‌కు వచ్చినా తాము పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోసారి ఈ ప్రాంతానికి తన సినిమా షూటింగ్ కోసం వస్తానని రాజమౌళీ బదులిచ్చారు.
వీడ్కోలు పలికిన అధికారులు..
రాజమౌలి బృందానికి వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున ఉన్నతాధికారులు తరలివచ్చారు. కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, ట్రైనీ ఐఏఎస్ జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరపు సశ్యా రెడ్డి, జయపూర్ ఎస్‌డీపీఓ పార్ధో జగదీష్ కశ్యప్‌లు రాజమౌళి బృందాన్ని కలిశారు. అనంతరం మహేష్‌బాబు ఉంటున్న దేవమాలి కాటేజీకి వెళ్లి ఫొటోలు దిగారు.
1. నిర్మానుష్యంగా తులమాలి పర్వత ప్రాంతం
2.షూటింగ్ ముగియడంతో సేద తీరుతున్న
సినీ యూనిట్
3.తనకు భద్రత కల్పించిన స్థానిక పోలీసులతో
రాజమౌళి
జయపురం: జయపురం ప్రాంత ప్రజల కోరిక నేరవేరబోతుంది. ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయం ఈ నెల 22న ప్రారంభంకానుంది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహణ చరణ మఝిలు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దీన్ని నిర్వహిస్తారు. ఈ విద్యా ఏడాదిలో కేంద్ర విద్యాలయంలో చదువులు ప్రారంభించనున్నుట్లు అధికారులు వెల్లడించారు. ప్రారంభం తరువాత విద్యాలయంలో చేరేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అధికారుల పరిశీలన..
కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్, జయపురం సబ్‌కలెక్టర్ కుమారి ఎ. శోశ్య రెడ్డి, కొరాపుట్ కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజ్ కుమార్ దాస్, జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి విభాగ జూనియర్ ఇంజినీర్ చయిత బాస్కె తదితరులు బుధవారం కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. తాత్కాలిక కేంద్ర విద్యాలయాన్ని జయపురం సమగ్ర గిరిజనాభివృద్ది విభాగం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మించింది. అందులో 15 గదులు ఉండగా.. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించారు. భవనానికి రంగులు వేసి అందంగా తయారు చేస్తున్నారు. ఈ నెల 22న సంబల్‌పూర్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, భువనేశ్వరన్ నుంచి ఒడిశా ముఖ్యమంత్రి మోహణ చరణ మాఝి లు వర్చువల్‌గా విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతానికి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించనున్నారు. ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుందని నోడల్ అధికారి, కొరాపుట్ కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజ్ కుమార్‌దాస్ వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తామన్నారు.
తాత్కాలిక భవనంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ తదితరులు
న్యూస్‌రీల్
1
జిల్లాలో ముగిసిన ఎస్‌ఎస్‌ఎంబీ–29 చిత్రం షెడ్యూల్
ధన్యవాదాలు తెలుపుతూ లేఖ
విడుదల చేసిన రాజమౌళి, ప్రియాంక చోప్రా
మహేష్‌బాబుతో ఫొటోలు దిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
రాజమౌళికి మిలెట్స్ బహూకరించిన
సీఎల్‌పీ నేత రామ్‌చంద్ర ఖడం
చివరిలో రాజమౌళి, ప్రియాంక చోప్రాలు ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. ఇక్కడి ప్రజల సహకారం, స్నేహశీలత మరువలేమన్నారు. ఆ లేఖను ఐఏఎస్ అధికారి సశ్యా రెడ్డికి అందజేసి ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమకు ఇన్ని రోజులు భద్రత కల్పించిన పోలీసులకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత నెల రోజులుగా వాహనాలు, వేలాది మంది సందర్శకులతో కళకళలాడిన తులమాలి పర్వత ప్రాంతం బోసిపోయింది. సినిమా యూనిట్ వాహనాలు తిరిగి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. సిమిలిగుడ పట్టణంలో ఒక్కసారిగా హోటళ్లలో సందర్శకుల తాకిడి తగ్గింది.
సీఎల్‌పీ నేత రామ్‌చంద్ర ఖడం, నాయకులతో రాజమౌళి
22న జయపురంలో కేంద్రీయ
విద్యాలయం ప్రారంభం
వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న
కేంద్ర మంత్రులు
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025