
ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
మల్కనగిరి: ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చున్నీలతో చెట్టుకొమ్మకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల సమితి పరిధి ఎంపీవీ–41 గ్రామ సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలను ఎం.వి.79 పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పొస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విద్యార్థినులు ఎం.వి–72 నోడల్ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న మందిరా షొడి, జ్యోతి హిల్దార్‌లుగా గుర్తించారు. విద్యార్థినుల మృతదేహాలు ఎం.పి.వి.41 గ్రామం సమీపంలోని ఒక చెట్టుకు తమ చున్నీలతో ఉరివేసుకుని వేలాడుతూ ఉండటాన్ని అటువైపుగా వెళుతున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టు కొమ్మకు చున్నీలతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment