
బొయిపరిగుడలో ఎస్సీ, ఎస్టీ స్టీరింగ్ కమిటీ పర్యటన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో రాష్ట్ర విధానసభ ఎస్సీ, ఎస్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నుంచి పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గుమ్మ గ్రామంలోని ఎస్‌ఎస్‌డీ ఉన్నత పాఠశాలను కమిటీ సభ్యులు సందర్శించారు. కమిటీ అధ్యక్షులు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. వారిచే పాఠ్య పుస్తకాలను చదివించి ప్రతిభను గమనించారు. వివిధ సబ్జెక్టలపై ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమన్నారు. అయితే సరైన జవాబులు చెప్పలేక పోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సక్రమంగా పాఠాలు చేప్పటంలేదని కమిటీ అభిప్రాయ పడింది. ఉపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. రెండు నెలల తరువాత కమిటీ మరోసారి పాఠశాలను సందర్శిస్తోందని అధ్యక్షులు రొంధారి చెప్పారు. అప్పటికీ విద్యాబోధనలో ప్రగతి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిటీలో నవరంగపూర్, కొట్‌పాడ్, కొరాపుట్, మల్కన్‌గిరి, మోహణ ఎమ్మెల్యేలు గౌరీ శంకర మఝి, రూపు భొత్ర, రఘునాథ్ మచ్చ, దాసరథి గొమాంగో, రఘునాఽథ్ మడకామి ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment