
స్వర్ణోత్సవ సంబరం
● ఘనంగా జరిగిన భారతీ సాహితీ,
సంస్కృతి సమాజం 50 ఏళ్ల పండుగ
జయపురం: జయపురంలోని భారతీ సాహితీ, సంస్కృతి సమాజం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. స్థానిక మణికంఠ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన వేడుకలకు బి.ఎస్.ఎన్.మూర్తి (డికెన్స్) విశాఖపట్నం వారు అధ్యక్షత వహించారు. విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భారతీ సాహిత్య సంస్కృతి అభిమానులు, సాహితీ వేత్తలు, రచయితలు, కవులు పాల్గొన్నార. ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ వ్యంగ చిత్రకారిణి జ్యోతిర్మయి కార్టూన్ల ప్రదర్శన అలరించింది. రచయిత, అనువాదకులు కె.వి.రమణ భారతీ సాహితీ, సంస్కృతి ప్రధాన లక్ష్యం తెలుగు భాషా సాహిత్యాల ప్రగతి, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించటమే ఉద్దేశమని నిర్వహకులు అన్నారు. భారతి కార్యదర్శి కూర్మారావు నివేదికను సమర్పించారు. ఉపాధ్యాయుడు మురళీ జయపురం చారిత్రిక ఘట్టాలను, జయపురం ప్రాధాన్యతను, రాజుల పరితను క్లుప్తంగా సభికులకు వివరించారు. అనంతరం సాహితీ కథనం స్వీయ కవితా పఠన కార్యక్రమం గరికపాటి సూర్యప్రభ,ఆరిక రాధాకృష్ణలు నిర్వహించారు. రచయిత స్వీయ కవితా పఠనాన్ని ‘ఎక్కడెక్కడో పిట్లులు ఎగురు కుంటూ వచ్చి’అన్న తన స్వీయ గీతాన్ని ఆలపించారు.

స్వర్ణోత్సవ సంబరం

స్వర్ణోత్సవ సంబరం

స్వర్ణోత్సవ సంబరం