
రిఫర్ చేసేయ్...!
విజయనగరం ఫోర్ట్: ఉత్తరాంధ్రలో అతి పెద్ద మాత, శిశు ఆస్పత్రి అయిన ఘోషాస్పత్రిలో సమస్యలు కొలువుదీరాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, పిల్లలు అవస్థలు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూ (నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం) ఉంది. నవజాత శిశువులకు చికిత్స అందించడానికి అవసరమైన పరికరాలు, ఆక్సిజన్, వెంటిలేటర్స్ ఉన్నప్పటకీ కేజీహెచ్‌కు శిశువులను రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గర్భిణులను కూడా కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్‌కు శిశువులను తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో కొందరు, చికిత్స పొందుతూ మరి కొందరు మృత్యువాత పడుతున్నారు.
ఆస్పత్రిలో పారిశుధ్య లోపం
ఆస్పత్రిలో పారిశుధ్య లోపం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్య చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్ల దుర్వాసన వస్తున్నట్టు రోగులు చెబుతున్నారు. మాత, శిశువులకు సంబంధించిన ఆస్పత్రి కాబట్టి నిరంతరం ఆస్పత్రిని క్లీన్ చేయాల్సి ఉంది. కానీ ఆ విధంగా చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేడి నీళ్లు బయట కొనుగోలు
చేయాల్సిన దుస్థితి
ఆస్పత్రిలో 2500 లీటర్ల సామర్థ్యం గల సోలార్ హీటర్లు ఉన్నాయి. అవి గత కొంత కాలంగా పని చేయడం లేదు. దీంతో వేడి నీళ్లు రావడం లేదు. వేడి నీళ్లను గర్భిణులు, బాలింతల బంధువులు ప్రైవేటు టీస్టాల్స్ వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. బాటిల్ వేడి నీళ్లు రూ.20 చొప్పన కొనుగోలు చేస్తున్నారు.
నిత్యం అధిక సంఖ్యలో..
ఆస్పత్రికి నిత్యం అధిక సంఖ్యలో రోగులు వస్తారు. 180 నుంచి 200 వరకు రోగులు ఆస్పత్రికి వస్తారు. వీరిలో గైనిక్ సంబంధిత సమస్యలతో వచ్చే వారు 30 నుంచి 40 మంది వరకు ఉన్నారు. గర్భిణులు, పిల్లలు 160 నుంచి 170 మంది వరకు ఉంటున్నారు. ఆస్పత్రిలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆస్పత్రిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు ఫ్లోర్‌లు ఉన్నాయి. లిఫ్ట్ లేక పోవడం వల్ల మెట్లుపై నుంచి వెళ్లాల్సి రావడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
అత్యవసరం అయితేనే..
గర్భిణులను, నవజాత శిశువులను అత్యవసరం అయితేనే రిఫర్ చేయాలి. ఇక్కడ చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటకీ రిఫర్ చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లిఫ్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఇతర సమస్యలు పరిష్కరానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ ఎస్.అప్పలనాయుడు,
సూపరింటెండెంట్, ఘోషాస్పత్రి

రిఫర్ చేసేయ్...!

రిఫర్ చేసేయ్...!
Comments
Please login to add a commentAdd a comment