
ఎన్నికల ప్రచారానికి కొరాపుట్ నేతలు
కొరాపుట్: మొదటి దశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రముఖ పార్టీలు మెదటి దశలో ప్రచారంలో పాల్గొన్న నేతలను మిగతా ప్రాంతాలకు తరలించాయి. అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాలకు వెళ్లారు. నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం అసెంబ్లీ స్థానం నుంచి బీజేడీ అభ్యర్థిగా పనిచేసిన ఎంపీ రమేష్ చంద్ర మజ్జి సంబల్‌పూర్ తరలి వెళ్లారు. ఆ స్థానంలో పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్న బబి దాస్ కోసం ప్రచారం చేయనున్నారు. శుక్రవారం కుటిండ అసెంబ్లీ స్థానంలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీజేడీ నబరంగ్‌పూర్ అదనపు పరిశీలకుడు దేవాశిస్ పాత్రో, జిల్లాకి చెందిన రాష్ట్ర మైనల్ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ప్రమెద్ పాఢీలు పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గంలో రాయగడ జిల్లాకి చెందిన బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావులు ప్రచారం చేస్తున్నారు. భద్రక్ జిల్లాలో కొరాపుట్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణీగ్రాహి ప్రచారం చేస్తున్నారు. కొరాపుట్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన ఎంపీ సప్తగిరి ఉల్క ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఆంధ్రలోని రామభద్రపురం వద్ద స్థానిక మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ప్రచారానికి కొరాపుట్ నేతలు

ఎన్నికల ప్రచారానికి కొరాపుట్ నేతలు