
పౌల్ట్రీస్ పరిశ్రమ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులు
● రెండు వారాలుగా నిరసన ● పట్టించుకోని యాజమాన్యం
చీపురుపల్లి: రేయింబవళ్లు పనిచేస్తున్నారు. యాజమాన్యం చెప్పిన ప్రతి పనీ చేస్తున్నారు. విధి నిర్వహణే పరమావధిగా పనులు నిర్వహిస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా వేతనాలు పెంచండి మహాప్రభో అంటూ కార్మికులు కోరుతుంటే యాజమాన్యం ససేమిరా అంటోంది. ఇదీ మండలంలోని కర్లాం పరిసరాల్లో గల శ్రీ వెంకటరామా పౌల్ట్రీస్ పరిశ్రమలో కార్మికుల పరిస్థితి. ఆ పరిశ్రమ కార్మికులు తమకు పనికి తగ్గ వేతనాలు పెంచాలని కోరుతూ రెండు వారాలుగా పరిశ్రమ ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. విధులు బహిష్కరించి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ పరిశ్రమ యాజమాన్యం స్పందించడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వెంకటరామా పౌల్ట్రీస్ పరిశ్రమలో ఈ ప్రాంతానికి చెందిన 170 మంది విధులు నిర్వహిస్తున్నారు. స్థానికేతరులైన ఒడిశా ప్రాంతానికి చెందిన కార్మికులు చాలామంది పరిశ్రమలో ఉన్నారు.