టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలన్న వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిన శ్రేణులు బీఆర్ నాయుడు వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శల వెల్లువ
సాగర్ నీటిమట్టం వివరాలు
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఉదయం విజయవాడ నగరంలోని గాంధీజీ మహిళా కళాశాల సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు. టోకెన్ కౌంట ర్‌లో రూ.5 చెల్లించి క్యూలో నిలబడి, భోజనానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. క్యాంటీన్‌లో వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తాను కూడా ఆహార నాణ్యత పరీక్షించేందుకు భోజనం చేశారు. ఈ పర్యటనలో వీఎంసీ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరా బాద్ మోతీనగర్‌కు చెందిన పి.రజనీకాంత్ శర్మ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధి కారులను కలిసి వేలంమర్రి సాంబశివ శర్మ, పద్మావతి పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లె రైలుపేటకు చెందిన ద్రోణవజ్జల బ్రహ్మ అవధాని దంపతులు, విజయవాడ సూర్యా పేటకు చెందిన బమిడిపాటి శ్రీమన్నారాయణ కుటుంబం, బమిడిపాటి శారద కుటుంబం రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశాయి. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్.నాయుడు తీరుపై ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన గళం వినిపించాయి. ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జుల ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని బి.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాయి.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో..
టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించా లని కోరుతూ విజయవాడ పటమట శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఎమ్మెల్సీ కల్పలత, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు తంగిరాల రామిరెడ్డి, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీపై తన టీవీ చానల్‌లో అసత్య ప్రచారాలు చేసినందుకే బీఆర్‌నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. తమ కులదైవం వెంకటేశ్వరస్వామని చెప్పుకొనే చంద్రబాబు తక్షణం బి.ఆర్.నాయుడును పదవి నుంచి తప్పించాలన్నారు.
విజయవాడ పశ్చిమంలో..
తిరుమల దేవస్థానం పవిత్రత కాపాడేందుకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యాధర పురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దెబ్బతీసేలా చంద్రబాబు చేస్తున్న చర్యలను హిందూ సమాజం చీదరించుకుంటోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్య లక్ష్మి, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్‌లో..
చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై చంద్రబాబుకు నిజమైన ప్రేమ ఉంటే వెంటనే బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పెనమలూరులో..
తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవభక్తుని చక్రవర్తి డిమాండ్ చేశారు. కానూరు తిరుపమ్మ ఆలయంలో శనివారం ఆయన పార్టీ నేతలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి విషయంలో టీడీపీ ప్రభుత్వం అలంబిస్తున్న తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
7
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 532.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 13,866 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


