పెనమలూరు: తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన శనివారం పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.2162 కోట్లతో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కోయా ఆనంద్‌ప్రసాద్, ఎంఈవో, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లోపాలు కనబడలేదా..?
కాగా మంత్రి, ఎమ్మెల్యే పెనమలూరు పాఠశాలలో ఆస్మిక తనిఖీ చేసిన సమయంలో లోపాలు కనబడలేదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన భోజనం పిల్లలకు పెట్టడం లేదని, ప్రతిరోజు మెను అమలు జరగటం లేదని వాపోయారు. మంత్రి తనిఖీలో రిజిస్టర్ చూసి ఉంటే కోడిగుడ్లు వ్యవహారం తేలేదని చెబుతున్నారు. గతంతో పోల్చితే మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యత లోపం కారణంగా ఆదరణ తగ్గిందని, ఇప్పటికై నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తల్లి దండ్రులు కోరుతున్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర


